పోలీసుల అధీనంలో రాజీవ్ రహదారి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులపై ఆదివారం జరిగిన లాఠీచార్జికి నిరసనగా సోమవారం వివిధ పార్టీల పిలుపు మేరకు చేపట్టిన మెదక్ జిల్లా బంద్ పాక్షికంగా జరిగింది. తూర్పు మెదక్ ప్రాంతంలోనే బంద్ ప్రభా వం కనిపించింది. ముందుగానే ప్రతిపక్షాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేయడం, భారీ ఎత్తున బలగాలను మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొం ది. జిల్లా సరిహద్దు ప్రాంతం ఒంటిమామిడి నుంచి కుకునూర్‌పల్లి వరకు 30 కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారిని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఒంటిమామిడి.. రంగారెడ్డి జిల్లా తుర్కపల్లి గ్రామాల మధ్య రెండు కిలోమీటర్ల పరిధి లో రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వందల మందిని మోహరించారు.
పోలీసు వలయంలో ముంపు పల్లెలు
వేములఘాట్, పల్లెపహాడ్, ఎర్రవల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్, సింగారం, బంజేరుపల్లి తదితర ముంపు గ్రామాలను పోలీసులు చుట్టుముట్టారు. బయటి వ్యక్తులు ఊళ్లోకి రాకుండా దిగ్బంధించారు. దీనికి నిరసనగా ముంపు గ్రామాల ప్రజలు ర్యాలీలు నిర్వహించారు.ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహ నం చేశారు. ఆందోల్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతులు మల్లన్నసాగర్‌ను త్వరగా పూర్తి చేయాలంటూ ర్యాలీ చేపట్టారు. సిద్దిపేటలో ప్రతిపక్షాల నేతలు బంద్‌లో భాగంగా దుకాణాలు మూసివేయించగా... వారి వెనకే టీఆర్‌ఎస్ శ్రేణులు వెళ్లి వాటిని తెరిపించాయి.
మెదక్ బంద్ పాక్షికం.. ఉద్రిక్తం
Published Tue, Jul 26 2016 1:51 AM | Last Updated on Mon, Oct 8 2018 9:00 PM
Advertisement