ప్రతిపక్షాల కుట్రలను కడిగేస్తా.. | Harish Rao focus on Mallanna Sagar Project | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాల కుట్రలను కడిగేస్తా..

Published Fri, Dec 9 2016 2:52 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ప్రతిపక్షాల కుట్రలను కడిగేస్తా.. - Sakshi

ప్రతిపక్షాల కుట్రలను కడిగేస్తా..

 పుల్‌కల్: ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ప్రతి పక్షాల కుట్రలను త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో కడిగి పారేస్తామని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పుల్‌కల్ మండలం సింగూరు ప్రాజెక్టు వద్ద సిరారపు రాజ నర్సింహ ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే.. దురుద్దేశంతో విపక్షాలు అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేం దుకు కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక కుట్రలు చేశారన్నారు. ఆరేళ్ల క్రితం చనిపోయిన రైతులు ఇప్పుడు కోర్టులో కేసు ఎలా వేస్తారని మంత్రి ప్రశ్నించారు. చనిపోయిన రైతుల వేలిముద్రలను కాంగ్రెస్ నాయకులే నొక్కి తప్పుడు కేసులు వేశారని, ఇందుకు సంబం ధించిన ఆధారాలు సేకరించామన్నారు.
 
 ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం
 ఉమ్మడి ఏపీలో తెలంగాణకే కాకుండా మెదక్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని హరీశ్ పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి సింగూరును నింపుతా మని హరీశ్‌రావు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement