
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం సిద్దిపేట జిల్లా వేములఘాట్‌లో సేకరించనున్న భూములకు భూవిలువల సవరణ ఉత్తర్వులు అమలుకాకుండా హైకోర్టు నిలిపివేసింది. మార్కెట్ విలువలను సవరిస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఇటీవల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఎమ్మెస్ రామచందర్‌రావు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
మార్కెట్ ధరకు అనుగుణంగా కలెక్టర్ జారీ చేసిన సవరణ ఉత్తర్వులు లేవని, భూసేకరణ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొంటూ నర్సింహారెడ్డి, మరో 23 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కలెక్టర్ ఉత్తర్వుల్ని సస్పెండ్ చేసిన న్యాయమూర్తి.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment