శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదానం, గో సంరక్షణ పథకానికి రూ. 2 లక్షలు విరాళాన్ని అందజేశారు.
మల్లన్న ఆలయానికి రూ. 2 లక్షలు విరాళం
Dec 7 2016 12:08 AM | Updated on Oct 8 2018 9:10 PM
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదానం, గో సంరక్షణ పథకానికి రూ. 2 లక్షలు విరాళాన్ని అందజేశారు. ఇందులో అనంతపురానికి చెందిన కాంతం రాజేశ్వరి రూ. లక్ష అన్నదాన పథకానికి, ధర్మవరంకు చెందిన ఆదిములం సత్యవతిలు రూ. లక్ష గోసంరక్షణ నిధికి అందించారు. స్వామిఅమ్మవార్ల దర్శనానంతరం విరాళాల కేంద్రంలోని పర్యవేక్షకులు మధుసూదన్‌రెడ్డికి విరాళానికి సంబంధించిన నగదు మొత్తాన్ని అందజేశారు. ఆ తరువాత వారికి స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలను బహూకరించారు.
మహానందిలో..
మహానంది: మహానంది క్షేత్రంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ప్రకాశం జిల్లా బెస్తవారిపేటకు చెందిన కె.సుబమ్మ, సత్యం దంపతులు రూ. 51000 చెక్కును అందించినట్లు సూపరింటెండెంట్ పరశురామశాస్త్రి మంగళవారం తెలిపారు.
Advertisement
Advertisement