గజ్వేల్ రాజీవ్ రహదారిలో తనిఖీలు
- వచ్చిన వారినల్లా అరెస్టు చేసిన పోలీసులు
- నాటకీయంగా పోలీసుల అదుపులోకి రేవంత్‌రెడ్డి, దామోదర, సునీతారెడ్డి, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి
గజ్వేల్: వేములఘాట్, ఎర్రవల్లి గ్రామాల్లో మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై లాఠీచార్జి, గాల్లో కాల్పులను నిరసిస్తూ సోమవారం చేపట్టిన మెదక్ జిల్లా బంద్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ కేంద్రంగా సాగింది. ఇక్కడ బంద్‌ను విజయవంతం చేయడానికి వివిధ మార్గాల్లో పోలీసుల కళ్లుగప్పి వచ్చిన కాంగ్రెస్, టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.
ప్రధానంగా టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, బీజేపీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు సునీత, నేతలు దాసోజు శ్రావ¯ŒSకుమార్, దయాకర్, బీజేపీ నేత రఘునంద¯ŒSరావులు నాటకీయ పరిణామాల మధ్య ఇక్కడ అరెస్టయ్యారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టణంలో ఉద్రిక్తత కొనసాగింది...
మల్లన్నసాగర్ బాధితులకు మద్దతుగా చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ గజ్వేల్‌లో తెల్లవారుజామునే ప్రతిపక్ష పార్టీల నేతలు రోడ్డెక్కారు. ముందుగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్దకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం పార్టీల నేతలు చేరుకుని డిపో గేటు ముందు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.
ఉదయం 9గంటల వరకు ఈ నిరసన కొనసాగింది. ఆ తరువాత సీఐ సతీష్, ఎస్‌ఐ కమలాకర్‌లు అక్కడికి చేరుకుని నేతలందరిని అరెస్టు చేసి దౌల్తాబాద్ పోలీస్‌స్టేçÙ¯ŒSకు తరలించారు. ఆ తర్వాత గజ్వేల్‌కు ఏ పార్టీ నేతలను రాకుండా కట్టడి చేసేందుకు పట్టణానికి వచ్చే ప్రజ్ఞాపూర్, తూప్రా¯ŒS రోడ్డుతో పాటు పలు మార్గాలను దిగ్బంధించారు.
రాజీవ్ రహదారిపై విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. అయినా ఎలాగైనా గజ్వేల్‌కు చేరుకుని బంద్‌లో పాల్గొనాలని టీడీపీ శాసనసభాపక్షనేత రేవంత్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రావ¯ŒSకుమార్, అద్దంకి దయాకర్ తదితరులు పోలీసుల కళ్లుగప్పి ఆర్టీసీ బస్సులు, బైక్‌లు, మరికొందరు కార్లలోనే అడ్డదారుల నుంచి గజ్వేల్‌కు చేరుకున్నారు.
ప్రధానంగా రేవంత్‌రెడ్డి ఆర్టీసీ బస్సులో వచ్చి వర్గల్ మండలం సింగాయపల్లి స్టేజీ వద్ద దిగిన తరువాత టీడీపీ నాయకులు ఆయనను కారులో చౌదర్‌పల్లి, సంగాపూర్ మీదుగా గజ్వేల్ పట్టణానికి తీసుకువచ్చారు. ఇదే సమయానికి దామోదర్ రాజనర్సింహ, తదితరులు సైతం వివిధ మార్గాల్లో గజ్వేల్‌కు చేరుకున్నారు. ఆ తరువాత వీరంతా స్థానిక నాయకులతో కలిసి పట్టణంలోని బస్టాండ్ ప్రాంతం నుంచి ఇందిరాపార్క్ చౌరస్తా మీదుగా మార్కెట్‌రోడ్డు వైపు వెళుతూ దుకాణదారులను బంద్‌కు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, టీఆర్‌ఎస్ నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఒక దశలో రెండు పార్టీల నేతలు ఘర్షణకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీఐ సతీష్, ఎస్‌ఐ కమలాకర్‌లు బలగాలతో హుటాహుటిన అక్కడికి చేరుకుని ముందుగా ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డిని అరెస్టు చేశారు. రేవంత్‌రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, బీజేపీ నేత రఘునంద¯ŒSరావులను సైతం పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించినా పోలీసులు నిలువరించగలిగారు. అనంతరం రేవంత్‌రెడ్డిని దౌల్తాబాద్ పోలీస్‌స్టేçÙ¯ŒSకు తరలించారు. ఇది పూర్తయ్యాక దామోదరతో పాటు దాసోజు శ్రావ¯ŒSకుమార్, అద్దంకి దయాకర్‌లను అరెస్టు చేసి గజ్వేల్ పోలీస్‌స్టేçÙ¯ŒSకు తరలించి అక్కడి నుంచి బేగంపేట పోలీస్‌స్టేçÙ¯ŒSకు తీసుకెళ్ళారు. ఇదిలా ఉంటే డీసీసీ అధ్యక్షురాలు సునీత అనూహ్యంగా పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తా వద్దకు చేరుకుని రోడ్డుపై ఒంటరిగా బైఠాయించారు.
సుమారు 15 నిమిషాలపాటు బైఠాయించి నిరసన తెలిపారు. ఆ తర్వాత మహిళా పోలీసుల సాయంతో అరెస్టు చేసి గజ్వేల్ స్టేష¯ŒS నుంచి తూప్రా¯ŒS వైపు తరలించారు. కాగా బంద్ నేపథ్యంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించారు.
సుమారు 10 నిమిషాలపాటు రాస్తారోకో కొనసాగగా పోలీసులు అరెస్టు చేసి ఆయనను రంగారెడ్డి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేçÙ¯ŒSకు తరలించారు. గజ్వేల్‌లో బంద్ సందర్భంగా విద్యాసంస్థలను మూసి వేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉదయం బంద్ ఉన్నా మధ్యాహ్నం వరకు పూర్తిగా తెరుచుకున్నాయి. ఆర్టీసీ బస్సులు ఉదయం 9గంటల తరువాత యథావిధిగా నడిచాయి.