భూమి పోతే ఎలాంటి బాధ ఉంటుందో తనకు తెలుసని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అయితే, ప్రాజెక్టులు కట్టే సమయంలో భూములు పోవడం సహజమని బహుళ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు వాటిని అర్ధం చేసుకోవాలని కోరారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంపై మాట్లాడారు. మల్లన్న సాగర్‌పై ప్రతిపక్షాలు అనవరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కట్టడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని మండిపడ్డారు. అందుకే కుట్రలు చేసి పోలీసులు కాల్పులు జరిపేదాక తీసుకెళ్లారని అన్నారు.