కాంగ్రెస్ రైతు సంఘీభావ సభ
హైదరాబాద్ : మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పరిస్థితిపై కాంగ్రెస్ నేతలు సోమవారం ఉదయం గవర్నర్ నరసింహన్ను కలుస్తారు. ముంపు గ్రామాల పరిస్థితిపై గవర్నర్కు వినతి పత్రం సమర్పిస్తారు.
అనంతరం గజ్వేల్లో కాంగ్రెస్ నేతలు రైతు సంఘీభావ సభ నిర్వహించనున్నారు. మల్లన్న సాగర్ భూ సేకరణను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు గత 100 రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సభ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం ముంపు గ్రామాల్లో 50 రోజులుగా 144 సెక్షన్ అమలు చేస్తోంది. రైతు సంఘీభావ సభతో గజ్వేల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశముండడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోనున్నారు.