నిరుపేదల పొట్ట కొట్టేందుకే మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శాసనసభా ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయంతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అల్గునూర్‌లో అరెస్టు చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్‌కు
-
భూ నిర్వాసితులకు అండగా ఉంటాం
-
శాసనసభాపక్ష ఉప నేత జీవన్‌రెడ్డి
మానకొండూర్: నిరుపేదల పొట్ట కొట్టేందుకే మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శాసనసభా ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయంతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అల్గునూర్‌లో అరెస్టు చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు రీడిజైనింగ్ పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు రూపకల్పన చేయడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందన్నారు.
రైతులను నిరాశ్రయులను చేయడానికే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. 2013 చట్టాన్నీ సర్కార్ ప్రభుత్వం నీరు గార్చుతోందన్నారు. ఈ చట్టాన్నీ రూపొందించేటప్పుడు కేసీఆర్ పార్లమెంట్ సభ్యుడిగా ఆ బిల్లుకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. 123 జీవోతో నిర్వాసితులకు ఎలాంటి లాభం లేదన్నారు. మంత్రి హరీష్‌రావు కేవలం ముఖ్యమంత్రి మెప్పు కోసమే మెదక్ జిల్లా రైతుల పొట్టగొట్టుతున్నాడని మండిపడ్డారు. నిర్వాసితుల హక్కులను కాలరాసే విధంగా పోలీసులు గాలిలో కాల్పులు జరపడమేంటని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు కనీసం నోటిఫికేషన్ కూడా జారీచేయలేదన్నారు. మిషన్ భగీరథ, ప్రాణహిత ప్రాజెక్టులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్, జిల్లా పరిషత్తు మాజీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు దిండిగాల్ల మధు, టౌన్ ప్రెసిడెంటు కర్ర రాజశేఖర్, రామగుండం ఇన్‌చార్జి బాబర్ సలీం పాల్గొన్నారు.