‘మల్లన్నసాగర్‌’లో 144 సెక్షన్‌ ఎత్తివేయాలి | to lift Section 144 at 'Mallannasagar | Sakshi

‘మల్లన్నసాగర్‌’లో 144 సెక్షన్‌ ఎత్తివేయాలి

Sep 2 2016 12:32 AM | Updated on Oct 8 2018 9:00 PM

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ ఎత్తివేయాలని భూనిర్వాసితుల కమిటీ జిల్లా కన్వీనర్‌ చింతమల్ల రంగయ్య, కోకన్వీనర్‌ పెద్దాపురం రమేష్‌ డిమాండ్‌ చేశారు.

  • భూనిర్వాసితుల కమిటీ డిమాండ్‌
  • హన్మకొండ : మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ ఎత్తివేయాలని భూనిర్వాసితుల కమిటీ జిల్లా కన్వీనర్‌ చింతమల్ల రంగయ్య, కోకన్వీనర్‌ పెద్దాపురం రమేష్‌ డిమాండ్‌ చేశారు.
     
    హన్మకొండలోని అంబేద్కర్‌ కూడలిలో గురువారం భూనిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో 144 సెక్షన్‌ ఎత్తి వేయాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులతో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు పేరుతో నిర్వాసితులపై కక్షగట్టి వేధిస్తోందన్నారు. నాయకులు ఉడుత రవీందర్, బొట్ల చక్రపాణి, చొప్పరి రవికుమార్, వీరన్ననాయక్, చందునాయక్, భానునాయక్, వెంకట్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement