మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో పశువులు చిక్కుకుపోయాయి. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ గ్రామానికి చెందిన బర్రెంకల చిన చంద్రయ్యకు 40 వరకు ఎడ్లు, ఆవులు ఉన్నాయి. శనివారం ఉదయం ఆయన పశువులను మేతకోసం అడవిలోకి వదిలిపెట్టాడు. ఆ రోజు సాయంత్రం మల్లన్నసాగర్ చుట్టూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో చంద్రయ్య పశువుల వద్దకు వెళ్లలేకపోయాడు.
ఆదివారం తెల్లవారు జామున మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాలను వదలడంతో పశువులు పక్కనే ఉన్న బ్రాహ్మణ బంజేరుపల్లి శివారులోని గుట్ట సమీపంలోకి వెళ్లాయి. మరొక పక్కన గతంలో కొండపోచమ్మసాగర్‌కు నీటిని తరలించిన కాల్వ ఉంది. ప్రస్తుతం ఈ కాలువ ద్వారా నీరు మల్లన్నసాగర్‌లోకి వెళుతోంది. కాగా తుక్కాపూర్‌కు చెందిన మరో రైతుకు చెందిన నాలుగు గేదెలు కూడా చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.– తొగుట (దుబ్బాక)
అక్కడే నిరసన..అక్కడే నిద్ర
వీరంతా జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలానికి చెందిన ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు. రెవెన్యూ అధికారుల తప్పిదంతో తొమ్మిది గ్రామాలకు చెందిన వేలాది మంది రైతుల పట్టాభూములు అసైన్డ్ భూములుగా నమోదయ్యాయి. ఈ తప్పును సరిదిద్దాలంటూ బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో నిరసన దీక్షను ప్రారంభించి.. రాత్రంతా సమావేశపు గదిలోనే పడుకున్నారు. గురువారం కూడా నిరసన కొనసాగించారు.
మరోపక్క వీరికి మద్దతుగా రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి.. విధులకు హాజరయ్యేందుకు వచి్చన తహసీల్దార్ స్వప్న, రెవెన్యూ సిబ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. 15 రోజుల్లో రికార్డులు సరిచేసి న్యాయం చేస్తామని అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు ప్రజాప్రతినిధులకు, రైతులకు హామీనివ్వడంతో ఆందోళనకు తెరపడింది.– జఫర్‌గఢ్
Comments
Please login to add a commentAdd a comment