మల్లన్నసాగర్ కట్టి తీరుతాం: హరీశ్ | Minister Harish Rao comments on mallanna sagar | Sakshi
Sakshi News home page

మల్లన్నసాగర్ కట్టి తీరుతాం: హరీశ్

Published Tue, Sep 20 2016 1:41 AM | Last Updated on Mon, Oct 8 2018 9:00 PM

మల్లన్నసాగర్ కట్టి తీరుతాం: హరీశ్ - Sakshi

మల్లన్నసాగర్ కట్టి తీరుతాం: హరీశ్

సిద్దిపేట జోన్ : తమది ప్రజా ప్రభుత్వమని, రైతుల కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో మల్లన్నసాగర్‌ని కట్టితీరుతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆయన  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రతిపక్షాలు అనవసరంగా గగ్గోలు పెడుతున్నాయని ఆరోపించారు.

ఇప్పటి వరకు పది గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ చేపట్టామని మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద కేవలం ఐదు గ్రామాల్లోనే ముంపు అవకాశం ఉందని చెప్పారు. తొమ్మిది గ్రామాల్లో జీఓ నెంబర్ 123 కింద రైతులు స్వచ్ఛందంగా భూసేకరణకు సమ్మతిస్తూ అంగీకర పత్రాలు అందించారని తెలిపారు. భూసేకరణలో భాగంగా స్వచ్ఛందంగా ముందుకురాని వారికోసం 2013 చట్టం కింద నోటిఫై చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement