జానారెడ్డి, షబ్బీర్ అలీ అరెస్ట్ | Congress senior Leaders Jana Reddy and Shabbir Ali Arrested | Sakshi
Sakshi News home page

జానారెడ్డి, షబ్బీర్ అలీ అరెస్ట్

Published Fri, Jul 29 2016 12:06 PM | Last Updated on Sat, Aug 11 2018 7:11 PM

జానారెడ్డి, షబ్బీర్ అలీ అరెస్ట్ - Sakshi

జానారెడ్డి, షబ్బీర్ అలీ అరెస్ట్

హైదరాబాద్ : మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులను పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలను పోలీసులు మధ్యలో అడ్డుకున్నారు. మెదక్ జిల్లా ములుగు మండలం ఒంటిమామిడి వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు, నేత‌ల‌కు మ‌ధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. జానారెడ్డి, షబ్బీర్ అలీని బీహెచ్ఈఎల్ రామచంద్రాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు.  కాంగ్రెస్ నేతల వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కూడా పోలీసులు అనుమతించలేదు.  

కాగా మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలు పర్యటనతోపాటు... ముంపు ప్రాంత ప్రజల ఆందోళనలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారిని పరామర్శించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు  ఈ నెల 26న ఛలో మల్లన్న సాగర్కు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు మాత్రం ఛలో మల్లన్నసాగర్ పర్యటనకు వెళ్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ లు చేశారు. ఈ నేపథ్యంలో టీ.కాంగ్రెస్ నేతలు మళ్లీ మల్లన్నసాగర్ బయలుదేరారు. అయితే రెండోసారి కూడా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement