కొమురవెల్లి మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో 144 సెక‌్షన్ కొనసాగుతోంది. వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్ గ్రామాల శివారుల్లో పోలీస్ పికెట్ కొనసాగుతోంది.
తొగుట: కొమురవెల్లి మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో 144 సెక‌్షన్ కొనసాగుతోంది. ముంపు గ్రామాలైన వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్ గ్రామాల శివారుల్లో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. జులై 24న వేములఘాట్ గ్రామస్తులపై లాఠీచార్జీ జరిగిన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి గ్రామాల్లోకి కొత్తవారిని అనుమతించడంలేదు. కొత్త వ్యక్తులకు గుర్తింపు కార్డు ఉంటేనే గ్రామాల్లోకి అనుమతిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను, ప్రజా సంఘాల నేతలను గ్రామాల్లోకి అనుమతించడంలేదు. కాలిబాటలో వెళ్లే వారిని కూడా తనిఖీ చేసి వదిలిపెడుతున్నారు. కాగా వేములఘాట్ గ్రామస్తులు చేపట్టిన దీక్షలు శనివారం నాటికి 63వ రోజుకు చేరాయి.