
మంత్రి హరీష్‌రావును భర్తరఫ్ చేయాలి
మల్లన్నసాగర్ నిర్మాణానికి రైతుల నుంచి దౌర్జన్యంగా భూములు లాక్కోవడమే కాకుండా అన్యాయంగా లాఠీచార్జి, కాల్పులకు కారణమైన రాష్ట్ర మంత్రి హరీష్‌రావును మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోపాలస్వామి డిమాండ్ చేశారు.
తొగుట: మల్లన్నసాగర్ నిర్మాణానికి రైతుల నుంచి దౌర్జన్యంగా భూములు లాక్కోవడమే కాకుండా అన్యాయంగా లాఠీచార్జి, కాల్పులకు కారణమైన రాష్ట్ర మంత్రి హరీష్‌రావును మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోపాలస్వామి డిమాండ్ చేశారు. బుధవారం తొగుటలో మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టంతో రైతులకు నష్టం జరుగుతుందంటూ రైతులను మభ్యపెట్టడం మంత్రికి తగదన్నారు. 123 జీవోతో మెరుగైన పరిహారం అందిస్తున్నామంటూ ప్రజలను తప్పదోవ పట్టించాడన్నారు.
కొమరవెల్లి మల్లన్నసాగర్ నిర్మాణం కోసం రైతుల నుంచి దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేసిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమాయకపు ప్రజలపై దుర్మార్గంగా వ్వవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. అక్రమంగా ఆరెస్ట్ చేసి జైల్‌కు పంపిన సీపీఎం నాయకులను బేషరుతుగా విడుదల చేయాలన్నారు. కాగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ ఒంటెల రత్నాకర్ మాట్లాడుతూ కొమరవెల్లి మల్లన్నసాగర్‌కు సేకరించిన భూములకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత కేంద్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 123 జీవోతో భూసేకరణ చేయడం దుర్మార్గమన్నారు.
కాగా ముంపు గ్రామాలైన వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, తుక్కాపూర్, బి. బంజేరుపల్లి, వడ్డెరకాలనీలలో హైకోర్టు తీర్పుతో పండుగ వాతవరణం నెలకొంది. గ్రామాల్లోని ప్రజలు, యువకులు , రైతులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి, టపాసుల కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబురాలు నిర్వహించారు.