
ఆరు నూరైనా 'మల్లన్న' ఆగదు
నిజామాబాద్: ఆరు నూరైన మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఆగదు' అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం నిజామాబాద్లో పోచారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి కావొద్దని కాంగ్రెస్, టీడీపీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన మండిపడ్డారు.
ముంపు ప్రాంతం లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం అనివార్యమని చెప్పారు. 800 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతుంటే.. విపక్షాలకు కనిపించడం లేదని మంత్రి పోచారం విమర్శించారు.