మల్లన్న సాగర్ ముంపు బాధితులకు సంఘీభావం తెలపడానికి బయలుదేరిన న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: మల్లన్న సాగర్ ముంపు బాధితులకు సంఘీభావం తెలపడానికి బయలుదేరిన న్యాయవాదుల బృందాన్ని ఒంటిమిట్ట వద్ద ములుగు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో న్యాయవాదులు అక్కడే ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు న్యాయవాదులను ములుగు పోలీస్స్టేషన్‌కు తరలించారు. ఆ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ భానుప్రసాద్ వాహనం న్యాయవాదులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్‌బాబు అనే హైకోర్టు న్యాయవాది కాలు విరిగింది. దీంతో న్యాయవాదులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు.