మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు నష్ట పోతున్న బాధితులకు 2013 చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇల్లెందుల రమేశ్ డిమాండ్ చేశారు.
దుబ్బాక రూరల్: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు నష్ట పోతున్న బాధితులకు 2013 చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇల్లెందుల రమేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం దుబ్బాకలో ఆర్‌అండ్‌బీ అథితి గృహంలో నియోజక వర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మల్లన్న సాగర్ భూ బాధితులకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 123 జీఓ పూర్తిగా నష్టం కలిగిస్తుందన్నారు. కేజీ నుంచి పీజీ విద్య ఇంతవరకు అమలు పర్చలేదన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయకపోవడంతో నిరుద్యోగులు భారీ సంఖ్యలో పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులకు ఇంతవరకు రుణమాఫీ నిధులు విడుదల చేయలేదని విమర్శించారు.
కార్యక్రమంలో టీడీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు గడీల జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు స్వామిగౌడ్, కరికె శ్రీనివాస్, చేగుంట, దౌల్తాబాద్, మిరుదొడ్డి, దుబ్బాక, మండలాల అధ్యక్షులు దుబ్బాక రాజయ్య, సుధాకర్‌రెడ్డి, మేకల పరమేశ్, జహంగీర్, నర్సింహారెడ్డి, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.