మల్లన్నసాగర్ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ప్రాజెక్ట్ కోసం ఇరిగేషన్, రెవెన్యు అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. పోలీసుల పహారా పెట్టొద్దని, తక్షణమే పోలీస్ బలగాలను ఉపసంహరించుకోవాలని కోదండరామ్ సూచించారు.