తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకాలకు 70 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూర్చుతోం దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
-
బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలిరావాలి
-
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి వెల్లడి
తొర్రూరు : తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకాలకు 70 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూర్చుతోం దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగా ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. అదేరోజు హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారన్నారు. బూత్‌కు ఐదుగురి చొప్పున జిల్లా నుం చి 10వేల మంది కార్యకర్తలు సభకు తరలివెళ్లేం దుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై లాఠీచార్జి చేయించడం దుర్మార్గమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమయ్య, మండల అధ్యక్షుడు పల్లె కుమార్, నాయకులు బొమ్మనబోయిన కుమార్, యాకయ్య, మధుసూదన్‌రెడ్డి, యాకయ్య, సురేష్ పాల్గొన్నారు.