రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ఏప్రిల్ 2న ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్-ఉధమ్ సింగ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం రుద్రాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య కొఠారి ప్రధాని బహిరంగ సభ షెడ్యూల్ వివరాలను తెలియజేశారు.
ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రుద్రపూర్‌లో ప్రధాని బహిరంగ సభ ఉండనుంది. ఆ తర్వాత అదే రోజు జైపూర్ రూరల్‌లోనూ బహిరంగ సభ జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏప్రిల్ 3న పితోర్‌గఢ్, వికాస్‌నగర్‌లలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఉత్తరాఖండ్‌లోని ఐదు లోక్‌సభ స్థానాల్లో ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారధ్యం వహిస్తున్నారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీలు కూడా బహిరంగసభలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment