నేడు మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం
నేడు మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం
Published Sun, Aug 28 2016 10:33 PM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
– ఆర్జిత సేవలు నిలుపుదల
– నదీ జలాలతో మల్లన్నకు అభిషేకం
– మంగళవారం ఉదయం వరకు జలాధివాసంలో శ్రీశైలేశుడు
శ్రీశైలం: రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా అభివద్ధి చెందాలనే సంకల్పంతో శ్రీమల్లికార్జునస్వామి వారికి సోమవారం సహస్రఘటాభిషేకాన్ని నిర్వహించడానికి దేవస్థానం సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 5గంటల నుంచి వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులు ప్రధానాలయం నుంచి పాతాళగంగ వద్దకు చేరుకుని కష్ణవేణి నదీమాతల్లికి విశేషపూజాధికాలను నిర్వహిస్తారు. కృష్ణాజలాలను కలశాలలో సేకరించి నందిమండపం, అంకాలమ్మగుడి, వీరభద్రస్వామివార్లకు కష్ణాజలాలతో అభిషేకం చేసి తిరిగి ప్రధానాలయం చేరుకుంటారు. యాగశాల వద్ద పాతాళగంగ నుంచి తెచ్చిన నదీ కలశాలకు సంప్రదాయబద్దంగా పూజలు చేసి ఆ కలశాలతో ఆలయప్రదక్షిణ చేస్తారు. అనంతరం స్వామివార్లకు పంచామతాభిషేకం, నదీజలాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఉదయం 7.30గంటల నుంచి స్వామివార్ల సహస్రఘటాభిషేకం ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగుతుంది. సాయంత్రం 6గంటల తరువాత స్వామివార్ల ధర్మదర్శనం ఉంటుంది. ఆ మరుసటిరోజు మంగళవారం ఉదయంజరిగే ప్రాతఃకాలపూజల వరకు శ్రీ మల్లికార్జునస్వామి జలవాసమై ఉంటారని అర్చకులు పేర్కొన్నారు.
ఆర్జితసేవలు తాత్కాలికంగా నిలుపుదల
శ్రీమల్లికార్జునస్వామివార్లకు జరిగే సహస్ర ఘటాభిషేకాన్ని పురస్కరించుకుని సోమవారం స్వామివార్లకు జరిగే ఆర్జిత అభిషేకాలు, గణపతి అభిషేకం, లక్షబిల్వార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మొదలైన ఆర్జిత సేవలన్నింటిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త ఆదివారం తెలిపారు. అదే విధంగా సోమవారం వేకువజామునే జరిగే సుప్రభాత, మహామంగళహారతి సేవాటికెట్లను కూడా నిలుపుదల చేశామని, సాయంత్రం జరిగే స్వామివార్ల కల్యాణోత్సవం, ఏకాంతసేవలు యథావిథిగా జరుగుతుందని పేర్కొన్నారు.
మూడవ రోజు కొనసాగిన వరుణహోమ, జపాదులు
వర్షాభావ పరిస్థితులు తొలగి వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపించాలని శ్రీశైలమహా„ó త్రంలో చేస్తున్న వరుణజపాలు, హోమాలు ఆదివారం నాటికి మూడో రోజు చేరుకున్నాయి. ప్రతిరోజూ 2పూటలా యజ్ఞాది క్రతువులను, వరుణమంత్రాలతో నిర్వహిస్తున్నారు. రుష్యశంగుడి బొమ్మను పిండితో చేసి ప్రత్యేకపూజలను చేయడంతో కుంభవష్టిగా వర్షాలు పడుతాయని శాస్త్రాలు చెబుతున్నాయని వేదపండితులు తెలిపారు. నిష్ణాతులైన పండితులు వరుణ జపహోమాలను ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ రుద్రపారాయణలు, వరుణసూక్తపారాయణ, చతుర్వేద పారాయణ, వరుణజపాలు, రుశ్యశంగజపం, విరాటపర్వ పారాయణ కార్యక్రమాలు ఆలయప్రాంగణంలో నిర్వహిస్తున్నారు.
Advertisement