'మల్లన్న' ను నిర్మించి తీరుతాం
మెదక్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తాము భయపడమని మంత్రి హరీష్ రావు తెలిపారు. రిజర్వాయర్ కోసం రైతులు స్వచ్ఛందంగా రిజిస్ర్టేషన్ చేసుకున్నారని మంత్రి అన్నారు. 120 జీవో కింద 9 గ్రామాలు ముందుకు వచ్చాయన్నారు. రైతులను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారని మండిపడ్డారు.
భూములు లేని రైతుల కూలీలకు పరిహారం చెల్లిస్తామన్నారు. రైతలకు ఎలాంటి నష్టం జరిగినా కాంగ్రెస్, టీడీపీలదే పూర్తి బాధ్యత అన్నారు. ఎవరెన్ని ఆటంకాంలు కలిగించినా మల్లన్న సాగర్ ప్రాజెక్టును కచ్చింతంగా నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు.