
లాఠీ చార్జి అమానుషం: ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు వాసులపై లాఠీచార్జి చేయడం అమానుషమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. న్యాయం అడిగిన బడుగు, బలహీన వర్గాలను అణచాలని చూడడం బాధాకరమని, సీఎం కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేద న్నారు.సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులుతో కలసి విలేకరులతో మాట్లాడారు.
రాజకీయ పక్షాల బంద్‌కు సంఘీభావంగా వెళ్లిన కోదండరాం, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని రమణ ఖండిం చారు.బాధితులతో గవర్నర్‌ను కలుస్తామన్నారు. రైతులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మోత్కుపల్లి చెప్పారు. ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయాలు ఉన్నా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని రావుల అన్నారు.