పట్టపగలు ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు? | Tejashwi Yadav: Govt Orders To Probe On Distribution Of Money | Sakshi
Sakshi News home page

పట్టపగలు ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు?

Published Sat, Sep 11 2021 6:08 PM | Last Updated on Sat, Sep 11 2021 7:55 PM

Tejashwi Yadav: Govt Orders To Probe On Distribution Of Money - Sakshi

పాట్నా: త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఓ గ్రామంలో పర్యటించాడు. అక్కడి గ్రామస్తులకు రూ.500 నోట్లు ఇస్తూ వీడియోకు చిక్కాడు. ప్రస్తుతం ఆ వీడియో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. పట్టపగలు నగదు రాజకీయం జరగడంపై అధికార పార్టీ గుర్రుమంది. ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. చదవండిస్విమ్మింగ్‌పూల్‌లో రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన డీఎస్పీ 

జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్‌కుమార్‌ శుక్రవారం ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) యువ నాయకుడు, మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజస్వీ యాదవ్‌ ఓ గ్రామంలో మహిళలకు డబ్బులు పంచుతూ కనిపించారు. తన కాన్వాయ్‌లో కూర్చుని అక్కడకు వచ్చిన మహిళలకు బహిరంగంగా రూ.500 నోట్లు ఇస్తున్నాడు. ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు? లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వి యాదవ్‌’ అని పేర్కొంటూ ఆ వీడియోను పంచుకున్నారు.

ఈ వీడియోపై అధికారులకు అధికార పార్టీ జేడీయూ ఫిర్యాదు చేసింది. దీంతో గోపాల్‌గంజ్‌ జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. బైకుంత్‌పుర్‌ సమీపంలో తేజస్వి డబ్బులు పంచాడని ఆరోపణలు రావడంతో స్థానిక పోలీసులు, బీడీఓను విచారించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ డబ్బు పంపిణీ అధికార పార్టీ, ఆర్జేడీ మధ్య వాగ్వాదం మొదలైంది. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. 
చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement