- తేజస్వీకి మద్దతుగా అభిమానుల పోస్టర్లు
- శ్రీజన్ స్కాంలో సీబీఐ తీరుపై లాలూ గుస్సా
పట్నా: బిహార్ రాజధాని నగరంలో బాహుబలి పోస్టర్లు హల్‌చల్ చేస్తున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను బాహుబలిగా అభివర్ణిస్తూ ఆయన అభిమానులు పలు చోట్ల హోర్డింగ్స్ పెట్టారు. సీఎం నితీశ్ కుమార్ మహాకూటమి నుంచి తప్పుకుని, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఎపిసొడ్ తర్వాత నుంచి తేజస్వీ తన కార్యక్రమాలను ఉధృతం చేశారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తోన్న శ్రీజన్ స్కాం విషయంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతోన్న ఉద్యమాలకు ఆయనే నేతృత్వ వహిస్తున్నారు.
శ్రీజన్‌పై సీబీఐ డ్రామాలు: పూర్తిగా జేడీయూ, బీజేపీ నాయకులే నిందితులుగా ఉన్న రూ.900 కోట్ల విలువైన శ్రీజన్ స్కాం దర్యాప్తులో కేంద్ర సంస్థ సీబీఐ తీరును ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తప్పుపట్టారు. బుధవారం పట్నాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ కేసులో ఇప్పటిదాకా సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టనేలేదు. దీనివెనుక పెద్ద కుట్రనాటకం దాగుందని నా అనుమానం’’ అని లాలూ అన్నారు.
బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడి అరెస్ట్: భగల్పూర్‌లో వెలుగుచూసిన శ్రీజన్ స్కాంను దర్యాప్తు చేస్తోన్న సిట్.. మంగళవారం బీజేపీ కిసాన్ మోర్ఛా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిపిన్ శర్మ, ఆర్‌ఎల్‌ఎస్పీ జిల్లా అధ్యక్షుడు దీపక్ వర్మాలను అదుపులోకి తీసుకుంది. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 18కి పెరిగింది.
ఏమిటీ శ్రీజన్ కుంభకోణం?: ముఖ్యమంత్రి నగర్ వికాస్ యోజన పథకం కింద వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ అయిఉన్న ప్రభుత్వ సొమ్మును.. భగల్పూర్ జిల్లాలోని శ్రీజన్ మహిళా వికాస్ సహయోగ్ సమితి అనే ఎన్జీవోకు తరలించారు. ఈ ఎన్జీవో మహిళలకు ఉపాధి, వృత్తి కోర్సుల ట్రైనింగ్ ఇచ్చేంది. ఇటీవలే సొంత బ్యాంకు ఏర్పాటుచేసుకునేందుకుగానూ ఆర్బీఐకి దరఖాస్తూ కూడా చేసింది. మొత్తం రూ.900 కోట్ల ప్రభుత్వ నిధులు ప్రైవేటు సంస్థకు వెళ్లిన వ్యవహారంలో జేడీయూ, బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారణఅయింది. సిట్.. ఈ కేసును పరిశీలిస్తుండగా, ఇటీవలే దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించారు.
బిహార్‌లో బాహుబలి హల్‌చల్
Published Wed, Aug 23 2017 3:38 PM | Last Updated on Tue, Sep 12 2017 12:51 AM
Advertisement