నితీష్ కుమార్‌కు తేజస్వి యాదవ్ సలహా - ఈ సారైనా.. | Tejashwi Yadav Advice To Nitish Kumar | Sakshi
Sakshi News home page

నితీష్ కుమార్‌కు తేజస్వి యాదవ్ సలహా - ఈ సారైనా..

Published Sun, Mar 3 2024 7:44 PM | Last Updated on Mon, Mar 4 2024 3:22 PM

Tejashwi Yadav Advice To Nitish Kumar - Sakshi

పాట్నాలో జరిగిన జన్ విశ్వాస్ ర్యాలీలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అతని మిత్రపక్షం బీజేపీపై ఆర్‌జెడీ నేత తేజస్వి యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ స్కీమ్ చేయించుకోండని ఎద్దేవా చేశారు.

నితీష్ కుమార్‌ను ఉద్దేశించి.. ఇప్పుడు ఉన్న కూటమిలోని శాశ్వతంగా ఉంటామన్న మీ మాటలకు ఈ సారైనా కట్టుబడి ఉండమని వ్యగ్యంగా స్పందిస్తూ.. ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో జరిగిన ర్యాలీలో మోదీతో పాటు నితీష్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఇందులో తాను ఇకపైన కూటమి మారబోయేది లేదని శాశ్వతంగా పార్టీలో ఉంటానని ప్రధాని సాక్షిగా వాగ్ధానం చేశారు.

ర్యాలీలో పాల్గొన్న నితీష్ కుమార్ ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు కురిపించారు. గతంలో ఎన్డీయే కూటమిలో ఉన్న నీతీశ్‌ కుమార్‌.. ఆ తర్వాత ఆర్‌జెడీతో పొత్తు కుదుర్చుకుని సీఎం పీఠమెక్కారు. ఇటీవల ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి మళ్లీ సొంత గూటికే చేరారు. ఈ సందర్భంగా నితీష్ మీద తేజస్వి మండిపడుతూ ఎప్పుడూ కూటములు మారుస్తూ వాగ్దానాలు చేసే ఈయన ఈ సరైన మాట మీద నిలబడి ఉండటానికి కట్టుబడి ఉండాలని సలహా ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement