రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి 'తేజస్వి యాదవ్' విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఆర్జేడీ మంచి ఫలితాన్ని సాధిస్తుందనే విశ్వాసం తమకు ఉందని అన్నారు.
మా పాలనలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలుసు. గత 10 సంవత్సరాల్లో బీహార్ కోసం ప్రధాని మోదీ ఏమి చేశారు? బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఏమీ రాలేదు. ద్రవ్యోల్బణం, రైతుల సమస్య ఇప్పటికీ అలాగే ఉందని తేజస్వి యాదవ్ అన్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్, ఏప్రిల్ 26న రెండో దశ, మే 7న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20వ తేదీన ఐదో దశ పోలింగ్, మే 25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్ ఉంటుందని సీఈసీ తెలిపారు. మరి కొన్ని రోజుల్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుందని విషయం తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment