న్యూఢిల్లీ/పట్నా: రైల్వే కుంభకోణంలో తన తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిల పేర్లను చేరుస్తూ సీబీఐ చార్జిషీటు వేయడంపై బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ స్పందించారు. ఇందులో కొత్తేమీ లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ దెబ్బతిన్నప్పుడల్లా ఇవి జరగడం మామూలేనని పేర్కొన్నారు. ‘బిహార్‌లో అధికారం కోల్పోవడంతో బీజేపీకి మాతో సమస్యలు ఏర్పడుతున్నాయి.
మరో వైపు, బీజేపీకి దీటుగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మహాఘఠ్ బంధన్ ఏర్పాటు చేస్తున్నాయి. ఈ పరిణామాలతోనే దర్యాప్తు సంస్థలను మాపైకి ఉసి గొలుపుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఈ డ్రామా 2024 ఎన్నికల దాకా సాగుతుందన్న విషయం పిల్లల్ని అడిగినా చెబుతారు’అని కేంద్రాన్ని ఆయన ఎద్దేవా చేశారు. సీబీఐ తర్వాత ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగుతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీలు తన నివాసంలో కార్యాలయాలు తెరవాలని కోరారు.
చదవండి: షిండే, ఠాక్రే వర్గాలకు ఈసీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment