CBI chargesheet
-
CBI: నిందితుడి డీఎన్ఏ, రక్తనమూనాలు సరిపోలాయి
కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైన ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీ వైద్యురాలిపై హత్యాచారం ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడి పనేనని సీబీఐ తెలిపింది. వైద్యురాలి మృతదేహంపై ఉన్న డీఎన్ఏ, రక్తనమూనాలు నిందితుని నమూనాలతో సరిపోలాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. సంజయ్ రాయ్‌కు వ్యతిరేకంగా 11 సాంకేతిక ఆధారాలను చార్జిషీటులో పొందుపర్చింది. బాధితురాలి మృతదేహం నుంచి సేకరించిన డీఎన్ఏ సంజయ్ రాయ్ డీఎన్ఏతో సరిపోలిందని తెలిపింది. అలాగే కురచ వెంట్రుకలు, పెనుగులాటలో సంజయ్ రాయ్ ఒంటిపై అయిన గాయాలు, అతని శరీరంపై, ప్యాంటుపై బాధితురాలి రక్తపు మరకలు, సీసీటీవీ ఫుటేజీ, అతని మొబైల్ ఫోన్ లొకేషన్, ఫోన్‌కాల్ వివరాలు.. ఇవన్నీ సంజయ్ రాయ్ పాత్రను నిర్ధారిస్తున్నాయని పేర్కొంది. సంజయ్ రాయ్ ఒంటిపై బలమైన గాయాలున్నాయని, వైద్యురాలు తీవ్రంగా ప్రతిఘటించినపుడు ఇవి జరిగాయని వివరించింది. పాశవిక హత్యాచారం జరిగిన ఆగస్టు 9న సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ మెడికల్ కాలేజిలో మూడో అంతస్తులోని సెమినార్ హాల్ వద్ద ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజి, అతని కాల్ డేటా ధ్రువీకరిస్తోందని తెలిపింది. సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు ఆగస్టు 10న అరెస్టు చేయగా.. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ చేపట్టిన విషయం తెలిసిందే. సెమినార్ హాల్ వైపు వెళుతున్నపుడు సంజయ్ రాయ్ మెడపై ఉన్న బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నెక్‌బ్యాండ్ తర్వాత అతను తిరిగి వెళుతున్నపుడు లేదని, సంజయ్ రాయ్ ఫోన్‌తో ఇది అనుసంధానమైనట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లా»ొరేటరీ నివేదిక ఇచి్చందని స్థానిక కోర్టుకు సీబీఐ తెలిపింది. -
కోల్‌కతా డాక్టర్ ఉదంతం: ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. సోమవారం మధ్యాహ్నం సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ ఛార్జిషీటును సమర్పించింది.ఈ ఘటనలో సామూహిక అత్యాచారం లేదని సీబీఐ తేల్చి చెప్పింది. కాంట్రాక్టు ప్రాతిపదికన కోల్‌కతా పోలీసులతో కలిసి వాలంటీర్‌గా పనిచేసిన నిందితుడు సంజయ్ రాయ్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశాడని సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేసింది. రాయ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ.. దాదాపు 200 మంది వాంగ్మూలాలు నమోదయ్యాయని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది.జూనియర్ డాక్టర్ ఆగస్టు 9న ఆర్జీకర్ ఆస్పత్రిలో మృతిచెందినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఘటన వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు, సిబ్బంది, మెడికల్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఈ కేసును కోల్‌కతా హకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఘటన జరిగిన మరుసటి రోజు నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఇతర ఆధారాలతో సహా సంజయ్ రాయ్‌ను సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.ఇక.. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్లు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు.చదవండి: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి: 10 మంది డాక్టర్లపై బహిష్కరణ -
కోట్ల ఆస్తి - కన్న కూతురు - కరుడుగట్టిన అల్లుడు
-
సీబీఐ తర్వాత.. ఇక ఈడీ వంతు: తేజస్వీ
న్యూఢిల్లీ/పట్నా: రైల్వే కుంభకోణంలో తన తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిల పేర్లను చేరుస్తూ సీబీఐ చార్జిషీటు వేయడంపై బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ స్పందించారు. ఇందులో కొత్తేమీ లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ దెబ్బతిన్నప్పుడల్లా ఇవి జరగడం మామూలేనని పేర్కొన్నారు. ‘బిహార్‌లో అధికారం కోల్పోవడంతో బీజేపీకి మాతో సమస్యలు ఏర్పడుతున్నాయి. మరో వైపు, బీజేపీకి దీటుగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మహాఘఠ్ బంధన్ ఏర్పాటు చేస్తున్నాయి. ఈ పరిణామాలతోనే దర్యాప్తు సంస్థలను మాపైకి ఉసి గొలుపుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఈ డ్రామా 2024 ఎన్నికల దాకా సాగుతుందన్న విషయం పిల్లల్ని అడిగినా చెబుతారు’అని కేంద్రాన్ని ఆయన ఎద్దేవా చేశారు. సీబీఐ తర్వాత ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగుతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీలు తన నివాసంలో కార్యాలయాలు తెరవాలని కోరారు. చదవండి: షిండే, ఠాక్రే వర్గాలకు ఈసీ షాక్! -
సిండికేట్ బ్యాంక్‌లో మోసం కేసులో సీబీఐ చార్జ్‌షీట్
న్యూఢిల్లీ: సిండికేట్ బ్యాంకులో జరిగిన రూ.209 కోట్ల మోసం కేసులో వ్యాపారవేత్త అనూప్ బర్తియా, బ్యాంక్ మాజీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) ఆదర్శ్ మన్చందన్, చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) భరత్‌సహా మరో 15 మందిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. జైపూర్ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ను సమర్పించింది. రియల్టీ ప్రాజెక్టులకు సంబంధించి నకిలీ పత్రాలు, ఇన్వాయిస్లు, వర్క్ ఆర్డర్లని వినియోగించి మొత్తం 118 రుణ అకౌంట్లకు రూ.209 కోట్ల నిధులను మళ్లించినట్లు సీబీఐ ఆరోపణ. 118 అకౌంట్లలో గృహ రుణ అకౌంట్లు, టర్మ్‌లోన్ అకౌంట్లు ఉన్నాయని ఉన్నతస్థాయి అధికారులు తెలిపారు. కమర్షియల్ ప్రాపర్టీల కొనుగోళ్లు, గృహ రుణాలు, ఓవర్ డ్రాఫ్ట్‌లు, వర్కింగ్ క్యాపిటల్ టర్మ్లోన్ల పేరుతో అధికారులు కుమ్మక్కై జైపూర్‌లోని మిరోడ్ బ్రాంచ్, మాళవ్య నగర్ బ్రాంచ్, ఉదయ్ పూర్ బ్రాంచీల నుంచి భారీ రుణాలను 118 అకౌంట్లకు మళ్లించినట్లు ప్రధాన ఆరోపణ. -
నిందితులుగా బ్యాంకు అధికారులు
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలకోట్ల రూపాయల అప్పు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాపై అభియోగ పత్రాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరో నెలలో దాఖలు చేసే అవకాశం ఉంది. మాల్యాకు చెందిన విమానయాన సంస్థ కింగ్ఫిషర్కు రుణాలు మంజూరు చేయడంలో పాత్ర వహించిన బ్యాంకు అధికారులు, కింగ్‌ఫిషర్ ఉన్నతస్థాయి అధికారులను అభియోగపత్రంలో నిందితులుగా పేర్కొననున్నారని తెలుస్తోంది. కింగ్ఫిషర్కు ఆరువేల కోట్ల రూపాయల రుణాల మంజూరుకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ చార్జిషీట్ దాఖలు చేయనుంది. ఈ మొత్తాన్ని ఎస్బీఐ నేతృత్వంలో మొత్తం 17 బ్యాంకులు కలిసి మంజూరు చేశాయి. -
పీఎన్బీ స్కాంలో మరో ఛార్జ్‌షీటు
ముంబై : డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ, పంజాబ్ నేషనల్ బ్యాంకులో పాల్పడిన భారీ కుంభకోణ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎన్బీ స్కాంలో మరో సూత్రధారి అయిన నీరవ్ మేనమామ మెహుల్ చౌక్సి, ఆయన గీతాంజలి గ్రూప్ కంపెనీలకు వ్యతిరేకంగా సీబీఐ బుధవారం మరో ఛార్జ్‌షీటు దాఖలు చేసింది. ముంబైలోని స్పెషల్ సీబీఐ కోర్టులో ఈ ఛార్జ్‌షీటును నమోదుచేసినట్టు అధికారులు తెలిపారు. మూడు రోజుల క్రితమే ఈ కేసులో తొలి ఛార్జ్‌షీటును సీబీఐ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పీఎన్బీలో దాదాపు రూ.13వేల కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు సీబీఐ తన ఛార్జ్షీటుల్లో పేర్కొంది. తొలుత దాఖలు చేసిన ఛార్జ్షీటులో సీబీఐ పలు బ్యాంకు టాప్ అధికారుల పేర్లను ప్రస్తావించింది. దీనిలో పీఎన్బీ మాజీ చీఫ్ ఉషా సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. పీఎన్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేవీ బ్రహ్మాజీ రావు, సంజయ్ శరణ్, జనరల్ మేనేజర్(ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) నేహాల్ అహద్‌లను కూడా సీబీఐ తన తొలి ఛార్జ్షీటులో పేర్కొంది. ప్రస్తుతం నమోదు చేసిన ఛార్జ్షీటులో మెహుల్ చౌక్సి, ఆయన గీతాంజలి సంస్థలను చేర్చింది. తొలి ఛార్జ్‌షీటు దాఖలైన మరుసటి రోజే పీఎన్బీ తన నాలుగో క్వార్టర్లో భారీగా రూ.13,416.91 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. బ్యాంకు ఇప్పటి వరకు పోస్టు చేసిన ఫలితాల్లో ఇదే అత్యధిక నష్టంగా విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, పీఎన్బీ భారీ కుంభకోణాన్ని విచారిస్తున్న సీబీఐ తన తొలి ఎఫ్ఐఆర్ను జనవరి 31న నమోదు చేసింది. నీరవ్‌మోదీ, ఆయన భార్య, సోదరుడు నిషాల్, అంకుల్ మెహుల్ చౌక్సి, పలువురు పీఎన్‌బీఐ అధికారులకు వ్యతిరేకంగా అప్పట్లో ఈ ఎఫ్ఐఆర్ను దాఖలు చేసింది. వెంటనే మరో రెండు ఎఫ్ఐఆర్లను కూడా సీబీఐ ఫైల్ చేసింది. తొలి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని సోమవారం సీబీఐ తన తొలి ఛార్జ్‌షీటును దాఖలు చేయగా.. రెండో ఎఫ్ఐఆర్ ఆధారితంగా నేడు రెండో ఛార్జ్‌షీటు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
సీఎం పేరు లేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వ్యాపమ్ పరీక్షల కుంభకోణంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ఈ కేసులో సీబీఐ మంగళవారం అభియోగపత్రం దాఖలు చేసింది. కుంభకోణానికి సంబంధించిన హార్డ్‌డిస్క్‌లు, కంప్యూటర్ ఫైళ్లలో సీఎం పేరును లేదా ఏకంగా ఆ ఫైళ్లనే తొలగించారన్న ఆరోపణలను సీబీఐ కొట్టిపారేసింది. అభియోగపత్రాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టుకు సీబీఐ సమర్పించింది. పైళ్లను అన్నింటినీ ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో పరీక్షించామనీ, వాటిపై ఇంతకు ముందెప్పుడూ సీఎం అన్న పదం ఉన్నట్లు కనిపించలేదని సీబీఐ అధికారులు తెలిపారు. మొత్తం 490 మందిని సీబీఐ ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. వారిలో ముగ్గురు వ్యాపమ్ అధికారులు ఉన్నారు. ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్(వ్యాపమ్) హిందీలో నిర్వహించిన ప్రీ మెడికల్ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఇండోర్‌కు చెందిన ప్రజా వేగు డాక్టర్ ఆనంద్ రాయ్, గ్వాలియర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆశిశ్ చతుర్వేది వెల్లడించడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. ఈ స్కాంలో గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బంధువులు, ఇద్దరు ఆరెస్సెస్ నేతలు, డజన్ల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలువచ్చాయి. హైకోర్టు ఆదేశాలతో సిట్, ఎస్టీఎఫ్ 2013లో దర్యాప్తు చేపట్టాయి. ఇప్పటిదాకా ఈ స్కాంకు సంబంధించి దాదాపు 2 వేల మందిని అరెస్టు చేశారు. అయితే కేసు నిందితుల్లో ఒకరైన గవర్నర్ కుమారుడు శైలేశ్ యాదవ్‌తో సహా కేసుకు సంబంధం ఉన్న 46 మంది అసహజ, అనుమానాస్పద రీతిలో మరణించారు. దీంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. -
వ్యాపమ్ స్కాంపై సీబీఐ ఛార్జిషీట్
భోపాల్ : అంతు చిక్కని మరణాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపం (యవసాయిక్ పరీక్షా మండల్) కుంభకోణం కేసులో సీబీఐ మంగళవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛార్జిషీటుల్ 490మంది పేర్లను సీబీఐ చేర్చింది. కాగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపింది. సీజ్ చేసిన హార్డ్‌డిస్క్‌ను ట్యాంపర్ చేసినట్లు దిగ్విజయ్ చేసిన ఆరోపణలపై ఎలాంటి ఎవిడెన్స్ లేదని పేర్కొంది. కాగా మధ్యప్రదేశ్ మెడికల్ కాలేజీలతోపాటు వివిధ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్న అంశం ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. స్కాంతో ప్రమేయం ఉన్న పలువురు అనుమానాస్పదంగా మృతిచెందడంతో ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో స్కాం విచారణ బాధ్యతలను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు, పోలీసు, రెవెన్యూ, తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన కేసులన్నింటి నుంచీ సిట్, ఎస్టీఎఫ్లను సుప్రీంకోర్టు తప్పించింది. ఈ కేసులన్నింటినీ సీబీఐకి అప్పగిస్తూ... స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అలాగే వ్యాపం కుంభకోణం దర్యాప్తుకు సుప్రీంకోర్టు అనూహ్య తీర్పునిచ్చింది. 2008 నుంచి 2012 మధ్య ఎంబీబీఎస్‌లో చేరినవారి అడ్మిషన్లు చెల్లుబాటుకావంటూ సంచలన తీర్పును వెల్లడించింది. దీంతో దాదాపు 600 మంది విద్యార్థులపై ఈ తీర్పు ప్రభావం పడింది. అదే సమయంలో విద్యార్థులు వేసిన పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఇక కొత్తగా పునర్విచారణ పిటిషన్లకు దాదాపు అవకాశం లేకుండా పోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
కింగ్‌ఫిషర్ కేసులో సీబీఐ చార్జిషీట్
ఐడీబీఐ అధికారులుసహా తొమ్మిదిమంది పేర్లు ముంబై: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి బ్రిటన్‌కు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా, ఆయన నియంత్రణలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో సంబంధమున్న ఐడీబీఐ రుణం కేసులో మంగళవారంనాడు సీబీఐ ఒక చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చార్జ్‌షీట్‌లో సోమవారం అరెస్టయిన తొమ్మిది మంది పేర్లు ఉన్నాయి. వీరిలో ఐడీబీఐ మాజీ చైర్మన్ యోగేష్ అగర్వాల్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఎఫ్ఓ ఏ రఘునాథన్, ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్‌లు ఓవీ బుండేలు, ఎస్కేవీ శ్రీనివాసన్, ఆర్ఎస్ శ్రీధర్, బీకే బాత్రా, కింగ్‌ఫిషర్ ఎగ్జిక్యూటివ్‌లు శైలేష్ బోర్కీ, ఏసీ షా, అమిత్ నంద్కర్ణిలు ఉన్నారు. కేసులో కీలక వ్యక్తి మాల్యాను అరెస్ట్ చేయాల్సి ఉంది. రుణం పక్కదారి..: కేఎఫ్‌ఏకు రూ.1,300 కోట్ల రుణం మంజూరు, పంపిణీ ప్రక్రియలో పలు అవకతవకలు చోటుచేసుకున్నటు తన ప్రత్యేక విచారణ బృందం కనుగొన్నట్లు చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొన్నట్లు సమాచారం. రుణంలో రూ.260 కోట్లను కేఎఫ్ఏ పక్కదోవ పట్టించింది. రూ.263 కోట్లు వేతనాల చెల్లింపులు, టీడీఎస్, ఆదాయపు పన్ను, రుణ ఇన్స్టాల్మెంట్లకు వెచ్చించింది. రుణంలో కొంత ‘‘తన వ్యక్తిగత అవసరాలకు’’ మాల్యా వినియోగించుకున్నట్లు చార్జిషీట్ వివరించింది. మాల్యా, కింగ్ఫిషర్కు సంబంధించిన అకౌంట్ల వివరాలను తెలియజేయాలని కోరుతూ ఇప్పటికే ట్యాక్స్ హెవెన్స్‌గా పేరొందిన బ్రిటిష్ విర్జిన్ ఐలాండ్స్, సింగపూర్‌లకు సీబీఐ లేఖలు రాసినట్లు చార్జ్‌షీట్ వివరించింది. తొమ్మిది మందికి రిమాండ్... మరోవైపు సోమవారం అరెస్టయిన తొమ్మిది మందికి ఇక్కడి సీబీఐ కేసుల ప్రత్యేక జడ్జి హెచ్ఎస్ మహాజన్ ఫిబ్రవరి 7వ తేదీ వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. వీరి బెయిల్ దరఖాస్తులను జనవరి 30న కోర్టు విచారిస్తుంది. -
ఆ హత్య గురించి రెండోభర్తకు తెలుసట!
కన్నకూతురు షీనా బోరాను ఇంద్రాణి చంపుతున్న విషయం.. ఆమె రెండో భర్త పీటర్ ముఖర్జీకి పూర్తిగా తెలుసునట. ఈ విషయాన్ని పేర్కొంటూ ఈ సంచలనాత్మక హత్యకేసులో సీబీఐ రెండో అనుబంధ చార్జిషీటు దాఖలుచేసింది. తనకు ఈ హత్య గురించి ఏమీ తెలియదని ఇంతకుముందు పీటర్ వాదించినా.. హత్య నుంచి మృతదేహాన్ని తరలించడం ప్రతి విషయంలోనూ అతడి పాత్ర కూడా ఉందని సీబీఐ తాజా చార్జిషీటులో పేర్కొంది. అతడిపై నేరారోపణ మోపడంపై వాదనలు శనివారం ప్రారంభం కానున్నాయి. 2012 ఏప్రిల్ నెలలో షీనాబోరా (24)ను కారులో గొంతు నులిమి చంపేశారు. ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఆమె మాజీ డ్రైవర్ శ్యామవర్ రాయ్ తదితరుల హస్తం ఇందులో ఉందని ఆరోపణలొచ్చాయి. తర్వాత ఆమె మృతదేహాన్ని పొరుగున ఉన్న రాయగడ్ జిల్లాలోని ఓ అడవిలో పారేశారు. ఆ ముగ్గురినీ గత సంవత్సరం ఆగస్టు నెలలో అరెస్టు చేశారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరానికి శ్యామ్వర్ రాయ్‌ని అరెస్టుచేసి విచారించినప్పుడు అతడు బయటపెట్టడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. తర్వాతి నుంచి అతడు అప్రూవర్‌గా మారాడు. పీటర్ ముఖర్జీతో తన సంబంధం విషయం తెలియని షీనాబోరా.. అతడి కొడుకు రాహుల్‌ను పెళ్లి చేసుకోవాలనుకుందని, అదే జరిగితే ఆమెకు ఆస్తిలో చాలా భాగం వెళ్లిపోతుందన్న భయంతోనే ఇంద్రాణి ఆమెను చంపడానికి ప్లాన్ వేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. -
అభియోగాల నమోదు ప్రక్రియ ఆపండి
దాల్మియాపై చార్జిషీట్లో సీబీఐ కోర్టుకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో రెండు వారాలపాటు అభియోగాల నమోదు ప్రక్రియను నిలిపేయాలంటూ హైకోర్టు మంగళవారం సీబీఐ కోర్టును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కడప జిల్లాలో సున్నపురాయి గనుల లీజు కేటాయింపులకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టిందని ఆరోపిస్తూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. దీన్ని సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో సీబీఐ నమోదు చేసిన చార్జిషీట్‌ను కొట్టేయడంతోపాటు ఈ కేసులో తదుపరి చర్యల్ని నిలిపేయాలంటూ దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ జైశ్వాల్ మంగళవారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. లీజు బదలాయింపులు నిబంధనల మేరకే జరిగాయన్నారు. సీబీఐ చేసిన ఆరోపణలకు ఎక్కడా ఆధారాలు చూపలేదన్నారు. పిటిషనర్ కేవలం కంపెనీ ఎండీ మాత్రమేనన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి అభియోగాల నమోదు ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. -
ఆత్మహత్యకు ముందు 400 నిమిషాల ఫోన్ కాల్!
హీరోయిన్ జియాఖాన్‌ది ఆత్మహత్యేనని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. అయితే, ఆత్మహత్య చేసుకోడానికి ముందురోజు రాత్రి ఆమె సూరజ్ పాంచోలీకి ఫోన్ చేసిందని, ఆ కాల్ దాదాపు 400 నిమిషాల పాటు కొనసాగిందని సీబీఐ చెబుతోంది. నటుడు సూరజ్ పాంచోలితో సంబంధాలు చెడిపోవంతో ఆమె 2013 జూన్ 3న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. ఫోరెన్సిక్ మెడిసిన్ నిపుణులు ఆమె మరణానికి కారణం ఆత్మహత్యేనని తేల్చారని, పోస్టుమార్టం చేసిన వైద్యుడి నివేదికతో కూడా ఇది సరిపోయిందని సీబీఐ స్పష్టం చేసింది. జియా ఖాన్ రాసిన సూసైడ్ నోట్‌ను కూడా ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించారని, సంతకం పెట్టకుండా మూడు పేజీలలో రాసిన ఆ లేఖ ఆమె మానసిక స్థితికి అద్దం పడుతోందని సీబీఐ తెలిపింది. సీనియర్ నటులు ఆదిత్య పాంచోలి, జరీనా వహాబ్‌ల కొడుకైన సూరజ్ పాంచోలీపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసులు పెట్టారు. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఈ కేసు పెట్టారు. అంతేతప్ప ఇది హత్య మాత్రం కాదని తేలింది. నిందితుడి ప్రవర్తనను, అతడితో తనకున్న సన్నిహిత సంబంధాన్ని, శారీరక, మానసిక హింసను అన్నింటినీ నఫీసా రిజ్వీ అలియాస్ జియాఖాన్ తన సూసైడ్ నోట్లో వివరంగా రాసింది. వాటివల్లే ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. చనిపోవడానికి రెండు మూడు రోజుల ముందు వరకు ఆమె సూరజ్ ఇంట్లోనే ఉంది. ఇద్దరి మధ్య మొబైల్ ఫోన్లో బాగా వాగ్యుద్ధం జరిగిందని, ఇద్దరికీ తెలిసిన ఓ అమ్మాయిని కలిసిన విషయంపై అతడు అబద్ధం చెప్పినట్లు ఆమె ఆరోపించిందని కూడా అంటున్నారు. ఆమె పదే పదే మెసేజిలు చేయడంతో.. తన మొబైల్లో జియా బ్లాక్ బెర్రీ మెసెంజర్ అకౌంటును సూరజ్ పాంచోలి డిలిట్ చేసేశాడని కూడా సీబీఐ పేర్కొంది. తర్వాత జియాఖాన్ అర్ధరాత్రి సమయంలో అతడికి ఫోన్ చేయగా మరోసారి ఇద్దరిమధ్య వాగ్యుగద్ధం నడిచింది. ఆ కాల్ దాదాపు 400 నిమిషాలు కొనసాగింది. తల్లి రబియా ఇంటికి తిరిగి వచ్చేసరికే జియా ఖాన్ తన బెడ్ రూంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దాంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు. -
'నా ఆనందం కోసం ఆలోచించావా?'
న్యూఢిల్లీ: 'రాహుల్‌తో నా జీవితం ఆనందంగా, భద్రంగా ఉంటుంది. తల్లిదండ్రులుగా నన్ను ప్రేమించేవారికి అంతకన్నా ఇంకేం కావాలి?'.. షీనా బోరా తన తల్లి ఇంద్రాణి ముఖర్జీయాకు రాసిన లేఖ ఇది. వరుసకు సవతి సోదరుడయ్యే రాహుల్‌తో షీనా బోరా డేటింగ్ చేస్తుండటంతో ఇంద్రాణి కుటుంబంలో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఆ సమయంలో తన సొంత నిర్ణయాలు తాను తీసుకునేందుకు అనుమతించాలంటూ షీనా బోరా తల్లి ఇంద్రాణికి ఈమెయిల్ లేఖ రాసిందని సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. 2012లో షీనాను ఇంద్రాణి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఈ హత్య ఘటనకు ముందే తల్లి ఇంద్రాణికి షీనా రాసిన లేఖలోని వివరాలను సీబీఐ వెల్లడించింది. ' నీ జీవితంలో నీకు ఏదైతే ఆనందం ఇస్తుందో అదే నువ్వు చేశావు. నాకు కూడా అంతే వర్తిస్తుంది. దానికి నువ్వెందుకు బాధపడుతున్నావు? నాలోను కొంతవరకు నీ లక్షణాలే ఉన్నాయి. నా జీవితాన్ని నేను వెతుక్కుంటాను. నువ్వు దాని గురించి కలతపడకు' అని షీనా తల్లిని ఉద్దేశించి లేఖలో పేర్కొంది. షీనా బోరా రాహుల్‌తో ప్రేమలో మునిగి ఉండటంతో వారిద్దరూ విడిపోవాల్సిందేనని ఇంద్రాణి ఒత్తిడి తెచ్చి ఉంటుందని, ఈ నేపథ్యంలోనే షీనా ఈ లేఖ రాసిందని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు తన చిన్న కూతురు వైదేహీతో షీనా బోరా సన్నిహితంగా ఉండటం, తన భర్త, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జీయాతో దగ్గరవుతుండటం కూడా ఇంద్రాణి సహించలేకపోయిందని, తన ఆస్తులను ఎక్కడ షీనా బోరా సొంతం చేసుకుంటుందోనని, వైదేహీని తనకు దూరం చేస్తుందేమోననే భావనతోనే ఇంద్రాణి ఆమె హత్యకు ఒడిగట్టి ఉండవచ్చునని దర్యాప్తు వర్గాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా సవతి తండ్రి పీటర్‌కు కూడా షీనా లేఖ రాసిందని, అందులో 'నా సమస్య ఇంద్రాణితోనే. అది నా వ్యక్తిగత విషయం. మీరు ఇంద్రాణికి ఈ విషయాన్ని చెప్పి ఒప్పించండి. అంతేకానీ నన్ను-రాహుల్‌ను దూషించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు' అని షీనా పేర్కొందని సీబీఐ తెలిపింది. -
రాజ్యసభ ఎంపీపై చార్జిషీటు
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో రెండో చార్జిషీటును సీబీఐ దాఖలు చేసింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఈ చార్జిషీటులో రాజ్యసభ సభ్యుడు విజయ్ దార్దా, నాగపూర్‌కు చెందిన ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ డైరెక్టర్లు, ఇతరుల పేర్లు ఉన్నాయి. విజయ్ దార్దా తనయుడు దేవేంద్ర, ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ డైరెక్టర్లు అరవింద్ కుమార్ జైశ్వాల్, మనోజ్ జైశ్వాల్, రమేష్ జైశ్వాల్‌లతో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన గుర్తుతెలియని అధికారులను నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 120బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం) కింద దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. సీబీఐ తన మొట్టమొదటి చార్జిషీటును ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌పై దాఖలు చేసిన సంగతి తెలిసిందే.