రాజ్యసభ ఎంపీపై చార్జిషీటు
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో రెండో చార్జిషీటును సీబీఐ దాఖలు చేసింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఈ చార్జిషీటులో రాజ్యసభ సభ్యుడు విజయ్ దార్దా, నాగపూర్కు చెందిన ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ డైరెక్టర్లు, ఇతరుల పేర్లు ఉన్నాయి. విజయ్ దార్దా తనయుడు దేవేంద్ర, ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ డైరెక్టర్లు అరవింద్ కుమార్ జైశ్వాల్, మనోజ్ జైశ్వాల్, రమేష్ జైశ్వాల్లతో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన గుర్తుతెలియని అధికారులను నిందితులుగా పేర్కొన్నారు.
వీరిపై భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 120బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం) కింద దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. సీబీఐ తన మొట్టమొదటి చార్జిషీటును ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌పై దాఖలు చేసిన సంగతి తెలిసిందే.