Delhi Special Court
-
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిగ్ ట్విస్ట్..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కేసులపై విచారణ జరుపుతున్న రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జడ్జి ఎంకే నాగ్‌పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియమితులయ్యారు. ఇక నుంచి ఢిల్లీ లిక్కర్ కేసును కావేరి భావేజా విచారించనున్నారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఢిల్లీ హయ్యర్ జ్యూడీషియల్ సర్వీసెస్‌కు చెందిన మరో 27 మంది న్యాయమూర్తులను(నాగ్‌పాల్‌తో సహా) ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. మరోవైపు ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్ (డీజేఎస్)కి చెందిన 31 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు. కాగా జస్టిస్ నాగ్పాల్మద్యం పాలసీ కేసును ప్రారంభం నుంచి విచారిస్తున్నారు. నాగ్‌పాల్ ఇక నుంచి ఢిల్లీ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వంటి పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. సిసోడియా, సింగ్ జ్యూడీషియల్ కస్టడీలో ఉండగా.. కవిత ఈడీ రిమాండ్‌లో ఉన్నారు. చదవండి: MLC Kavitha: మూడో రోజు ఈడీ విచారణ -
ముగిసిన పిళ్లై, కవితల ఉమ్మడి విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: లిక్కర్ స్కాంలో నిందితుడు, హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిపి విచారించింది ఇవాళ(సోమవారం మార్చి 20) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. పిళ్లై రిమాండ్ రిపోర్ట్‌లో కవితకు బినామీ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు గంటలపాటుగా వీళ్లిద్దిరినీ ఎదురుదెరుగా కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు. సౌత్ గ్రూప్‌తో సంబంధాలపై ముఖాముఖిగా వీళ్లను ప్రశ్నించినట్లు సమాచారం. సుమారు నాలుగు గంటలపాలు వీళ్లను ప్రశ్నించి.. అనంతరం పిళ్లైను కస్టడీ ముగియడంతో ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టుకు తరలించారు. ఢిల్లీ స్పెషల్ కోర్టు పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అనంతరం పిళ్లైని తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు కవితకు ఈడీ అధికారలు విడిగా విచారిస్తున్నారు. ఇదీ చదవండి: రేవంత్ సంచలన ఆరోపణలు.. సిట్ నోటీసులు -
Liquor Scam: ఫోన్‌ను నాశనం చేశారు.. మళ్లీ విచారించాలి: ఈడీ
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత మనీశ్ సిసోడియా ఈడీ కస్టడీని పొడిగించింది ఢిల్లీ స్పెషల్ కోర్టు. ఈ మేరకు శుక్రవారం కస్టడీని ఐదురోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈడీ ఆయన్ని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో శుక్రవారం హాజరు పర్చింది. మార్చి 20వ తేదీతో ఆయన జ్యుడీషియల్ కస్టడీ ముగియనుండగా.. తమ రిమాండ్‌ను మరో వారం పొడగించాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. వాదనల సందర్భంగా ఈడీ కీలక విషయాల్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. లిక్కర్ స్కాం సమయంలో.. సిసోడియా తన ఫోన్‌ను నాశనం చేశారని, కాబ్టటి ఆయన్ని మరోసారి ప్రశ్నించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని కోర్టుకు తెలిపింది ఈడీ. కిందటి ఏడాది జూలై 22వ తేదీన.. అంటే ఎక్సైజ్ పాలసీ కేసులో ఫిర్యాదు అందిన వెంటనే మనీశ్ సిసోడియా తన ఫోన్‌ను ఉన్నపళంగా మార్చేశారు. ఆ ఫోన్‌ను ఏం చేశారనేది కూడా విచారణ టైంలో ఆయన ఈడీకి తెలియజేయలేదు. సిసోడియా మెయిల్స్, మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్‌పరంగా విశ్లేషించడంతో పాటు కస్టడీ సమయంలో కీలక విషయాలు వెలుగు చూశాయని ఈడీ కోర్టుకు వెల్లడించింది. సిసోడియా కంప్యూటర్ నుంచి డాక్యుమెంట్లలలో మార్చి 2021కి సంబంధించి డాక్యుమెంట్లో ఐదు శాతం కమిషన్ అని పేర్కొని ఉందని, ఆపై సెప్టెంబర్ 2022కి సంబంధించిన మరో డాక్యుమెంట్లో 12 శాతం పెంపుదల గురించి ప్రస్తావన ఉందని ఈడీ కోర్టుకు వెల్లడించింది. అంతేకాదు.. సౌత్ లాబీ తరపునే ఇదంతా జరిగిందని వివరించింది. ఈ తరుణంలో.. సిసోడియా తరపు న్యాయవాది జోక్యం చేసుకుని.. సీబీఐ, ఈడీలు ఇవే వాదనలు వినిపిస్తున్నాయని, కొత్తగా ఏవీ వినిపించడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు తన క్లయింట్(సిసోడియా)ను గత వారం రోజుల్లో మొత్తంగా 12 నుంచి 13 గంటలు మాత్రమే ప్రశ్నించారని కోర్టుకు తెలిపారాయన. అయితే.. ఈడీ మాత్రం ప్రతీరోజూ ఆయన్ని ఐదు నుంచి ఆరు గంటలు ప్రశ్నించినట్లు, గురువారం సైతం ఆరు గంటలు విచారించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫేటేజ్ సైతం ఉన్నట్లు కోర్టుకు వెల్లడించింది. దీంతో ఇరు పక్షాల వాదనలు పూర్తి కావడంతో.. రిమాండ్ పొడగింపుపై తీర్పును రిజర్వ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు.. కాసేపటికే ఐదు రోజుల పొడిగింపు విధిస్తున్నట్లు తెలిపింది. లిక్కర్ పాలసీ రూపకల్పన- అమలులో జరిగిన అక్రమాలు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాలు, కనపడకుండా పోయిన ఫైల్స్, చేతులు మారిన ముడుపులు, మద్యం వ్యాపారులకు అనుకూలంగా పాలసీ రూపకల్పన,డీలర్ కమిషన్ 12 శాతానికి పెంపు, సౌత్ గ్రూప్ సహా నిందితులతో ఉన్న సంబంధాలపై సిసోడియాని ఈడీ తమ కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో సీబీఐ ఆయన్ని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్ట్ చేసింది. -
అందరినీ కలిపి విచారిస్తే ఎలా?.. ఈడీకి కోర్టు ప్రశ్న
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ పొడగింపు సందర్భంగా ప్రత్యేక న్యాయస్థాన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అందరినీ కలిపి విచారిస్తే ఎలా? అంటూ ఈడీ తీరును ప్రశ్నించింది ధర్మాసనం. గురువారం పిళ్లైని కస్టడీ పొడగింపు కోసం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పర్చింది ఈడీ. ఈ తరుణంలో పిళ్లైకి కస్టడీని ఈడీ విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించింది కోర్టు. అయితే.. ఈడీ వాదనల సందర్భంగా జోక్యం చేసుకున్న బెంచ్.. ‘అందరినీ కలిపి విచారిస్తే ఎలా? కొన్ని డాక్యుమెంట్ల ద్వారా కూడా విచారణ ఉంటుంది కదా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. లిక్కర్ స్కాం కేసులో కవిత అనుమానితురాలుగా ఉందని, కవితతో పాటు పిళ్లైని విచారించాల్సి ఉందని, అయితే.. కవిత ఇవాళ్టి విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి విచారణకు నోటీసులు ఇచ్చామని, కాబట్టి.. పిళ్లై కస్టడీ పొడగించాలని ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేసింది ఈడీ. దీంతో ఈడీ కస్టడీ పొడగింపునకు అనుమతిచ్చింది. ఇదిలా ఉంటే.. ఇవాళ విచారణకు హాజరుకాని కల్వకుంట్ల కవిత, తన న్యాయవాది ద్వారా ఈడీకి లేఖ ద్వారా బదులు పంపారు. కోర్టులో తన పిటిషన పెండింగ్‌లో ఉన్నందున రాలేనని, తన ప్రతినిధి ద్వారా సంబంధిత పత్రాలను(డాక్యుమెంట్లను) ఈడీకి పంపుతున్నట్లు లేఖ ద్వారా ఈడీకి వెల్లడించారు. ఈ తరుణంలో ఆమె విజ్ఞప్తికి అంగీకరించని ఈడీ.. చివరికి మరోసారి 20వ తేదీన తమ ఎదుట విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది కూడా. మరోవైపు కవితతో పాటు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనమైనట్లు తెలుస్తోంది. -
చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని వచ్చే సోమవారం పొడిగిస్తూ ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సెప్టెంబర్ 5న తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు గురువారం వెల్లడించిన సంగతి తెలిసిందే. చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేయకుండా కల్పించిన తాత్కాలిక రక్షణ గడువును వచ్చే గురువారం వరకు పొడిగిస్తునట్టు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఐఎన్ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ఉందంటూ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరం, ఇంద్రాణీ ముఖర్జీలు నిందితులుగా ఉన్నారు. గతేడాది కార్తిని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థలు 23 రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారణ చేపట్టాయి. అయితే ఇటీవల ఇంద్రాణీ అప్రూవర్‌గా మారారు. -
చిదంబరం సీబీఐ కస్టడీ మరో 4 రోజులు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంను మరో నాలుగు రోజులపాటు విచారించేందుకు ఢిల్లీ స్పెషల్ కోర్టు సీబీఐకి అనుమతించింది. చిదంబరం నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీని మరో 5రోజులపాటు పొడిగించాలంటూ సీబీఐ విజ్ఞప్తి చేసింది. సీబీఐ వినతి న్యాయబద్ధంగా ఉందన్న స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ ఈ 30వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ఐఎన్ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరంను ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణను సుప్రీంకోర్టు మంగళవారం వరకు పొడిగించింది. ఇదే కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించటాన్ని సవాల్ చేస్తూ చిదంబరం వేసిన పిటిషన్‌పై వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అప్పటికే(ఆగస్టు 21) చిదంబరం అరెస్టయినందున దీనిపై విచారణ నిష్ప్రయోజనమని వ్యాఖ్యానించింది. అయితే, ఈ కేసులో చట్టబద్ధమైన పరిష్కారం కోరే స్వేచ్ఛ ఆయనకు ఉందని పేర్కొంది. దీంతో ఈడీ కౌంటర్ అఫిడవిట్‌కు సమాధానం(రీజాయిండర్) ఇస్తామని చిదంబరం తరఫున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ తెలిపారు. నిష్పాక్షిక విచారణ, దర్యాప్తు అనేవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో అంతర్భాగమని, చిదంబరం ప్రాథమిక హక్కులను న్యాయస్థానం కాపాడాలని పేర్కొన్నారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగించేందుకు ధర్మాసనం అంగీకరించింది. -
జిందాల్‌పై అభియోగాలు నమోదుచేయండి
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణానికి సంబంధించిన కేసులో పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, మరో నలుగురిపై అభియోగాలు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు సోమవారం దర్యాప్తు సంస్థను ఆదేశించింది. జిందాల్‌తో పాటు మరో నలుగురిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 (చీటింగ్), 120–బి (క్రిమినల్ కుట్ర) కింద అభియోగాలు మోపాలని ప్రత్యేక న్యాయమూర్తి భరత్ పరాషర్ ఆదేశించారు. జిందాల్‌తోపాటు, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ సుశీల్ మరూ, మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ గోయల్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రాంత్ గుజ్రాల్, కంపెనీ అధీకృత ఉద్యోగి డీఎన్ అబ్రోల్‌పై అభియోగాలు మోపారు. మధ్యప్రదేశ్‌లోని బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించిన విషయాన్ని కోర్టు విచారించింది. నిందితులపై అభియోగాలను అధికారికంగా ప్రకటించేందుకు జూలై 25 వరకు సమయం ఇచ్చింది. -
24 వరకు కార్తీకి జ్యుడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొడుకు కార్తీని 24వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. తీహార్ జైల్లో తనకు ప్రత్యేక గది, బాత్రూమ్ ఇవ్వాలన్న కార్తీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. జైల్లో తనకు ఇంటి భోజనం తినడానికి అవకాశం ఇవ్వాలని, అలంకార వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతించాలని కార్తీ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 15న విచారించనున్నారు. -
వైట్‌కాలర్ నేరాలు గుర్తించడం కష్టమే
న్యూఢిల్లీ: సమాజంలో గౌరవ, మర్యాదలు పొందే వ్యక్తులు పాల్పడే నేరాల(వైట్‌కాలర్ నేరాలు)ను గుర్తించడం కష్టమేనని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు భావిస్తున్న బొగ్గు కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ ఇలా పేర్కొంది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మరో ఇద్దరు సీనియర్ అధికారులు కేఎస్ క్రోఫా, కేసీ సమారియాలను కోర్టు ఈ కేసులో దోషులుగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రజల నైతిక స్థైరాన్ని దెబ్బతీసే వైట్‌కాలర్ నేరాలు, సాధారణ నేరాల కన్నా ప్రమాదకరమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి నేరాలు అధిక ఆర్థిక నష్టాలను కలిగించడమే కాకుండా అందరి దృష్టిని ఆకర్షిస్తాయని జడ్జి భరత్ పరాశర్ అన్నారు. వైట్‌కాలర్ నేరాలకు పాల్పడేవారు ఎగువ ఆర్థిక, సామాజిక తరగతికి చెందినవారని, తమ వ్యక్తిగత లేదా వృత్తిపర విధుల్లో చట్టాలను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. ఎంతో ఆలోచించి, పక్కా ప్రణాళికతో చేయడం వల్ల వైట్‌కాలర్ నేరాలను పసిగట్టడం అత్యంత కష్టమని అన్నారు. -
కామన్వెల్త్ కుంభకోణంలో ఐదుగురికి శిక్షలు ఖరారు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన 2010 నాటి కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో ఢిల్లీ కోర్టు ఐదుగురికి శిక్షలు ఖరారుచేసింది. కుంభకోణం కింద నమోదయిన పలు కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టు.. వీధి లైట్ల ఏర్పాట్లలో చోటుచేసుకున్న అవినీతికి సంబంధించిన కేసులో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) కు చెందిన నలుగురు ఉన్నతోద్యోగులతోపాటు నాలుగేళ్ల సాధారణ జైలుశిక్ష, వీధి లైట్లు సరఫరా చేసిన సంస్థ ఎండీకి ఆరేళ్ల సాధారణ శిక్ష అమలు చేయాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి శిక్షలు కరారు కావడం ఇదే ప్రధమం. కామన్వెల్త్ క్రీడల కుంభకోణాన్ని దర్యాప్తు చేసిన సీబీఐ 2011లో దాఖలు చేసిన చార్జిషీట్ ప్రకారం.. క్రీడలకు ఆతిథ్యమిచ్చిన ఢిల్లీ నగరంలో అప్పటికే ఉన్న వీధి లైట్లను తొలిగించి, వాటి స్థానంలో అధునాతన లైట్లను ఏర్పాటుచేయాలని క్రీడల కమిటీ నిర్ణయించింది. అయితే కీలక స్థానాల్లో ఉన్న నలుగురు ఎంసీడీ ఉన్నతాధికారులు.. ఉద్దేశపూర్వకంగా ధరలు తారుమారుచేసి, తమకు అనుకూలమైన సంస్థకు కాంట్రాక్టు దక్కేలా చేశారు. ఆ సంస్థ నాసిరకం లైట్లను ఏర్పాటుచేసింది. దీంతో రూ.1.42 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. సీబీఐ సమర్పించిన సాక్ష్యాధారాలతో సంతృప్తిచెందిన కోర్టు.. నలుగురు ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు పొందిన సంస్థ ఎండీని దోషులుగా నిర్ధారించి, బుధవారం శిక్షలు ఖరారుచేసింది. కాగా, ఇప్పటికేవారు 11 నెలలు విచారణ ఖైదీలుగా జైలు జీవితం గడిపినందున శిక్షా కాలం నుంచి 11 నెలలను మినహాయించాలని కోర్టు సూచించింది. ఇక ఈ కుంభకోణంలో అసలు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సురేశ్ కల్మాడీ నిందితుడిగా ఉన్న కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. -
30 ఏళ్లుగా ఏం చేశారు?
న్యూఢిల్లీ: సరైన పత్రాలు లేవంటూ 30 ఏళ్ల కిందటి కేసును ముగించడానికి తాజాగా నివేదిక సమర్పించిన సీబీఐని ఢిల్లీ ప్రత్యేక కోర్టు తప్పుబట్టింది. ఆ నివేదికను ఆమోదిస్తూనే.. ఈ కేసులో తీవ్ర జాప్యం జరగడానికి బాధ్యులైన అధికారులెవరో తేల్చాలని సీబీఐ డెరైక్టర్ని ఆదేశించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిలో ముగ్గురు ఇప్పటికే చనిపోవడం, మరో వ్యక్తి వయసు ప్రస్తుతం 92 ఏళ్లుకావడంతో విధిలేని పరిస్థితుల్లో సీబీఐ విచారణను ముగించడానికి అంగీకరిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. పైగా కేసుకు సంబంధించిన పత్రాలు అందుబాటులో లేవన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన ముగ్గురు అధికారులతో కుమ్మక్కై డి.ఎన్. సర్కార్ అనే వ్యక్తి మోసానికి పాల్పడి తప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నట్లు 1984లో కేసు నమోదైంది. జపాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణం సందర్భంగా గాలి ఒత్తిడిలో తేడా వల్ల తన ఎడమ చెవి కర్ణభేరి దెబ్బతిని చెవుడు వచ్చిందని పేర్కొంటూ అందుకు పరిహారంగా సర్కార్ ఇన్సూరెన్స్ పొందారు. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసిన సీబీఐ మొదట సర్కార్ క్లెయిమ్ని సమర్థిస్తూ కోర్టుకు నివేదించింది. అయితే సీబీఐ తగినన్ని ఆధారాలు సేకరించలేదని భావించిన జడ్జి.. మరింత లోతుగా దర్యాప్తు చేయాలని 1985లో ఆదేశించారు. కానీ ఇంతకాలం తాత్సారం చేసిన సీబీఐ.. కేసుకు సంబంధించిన పత్రాలు లభించడం లేదంటూ దర్యాప్తు ముగింపు నివేదికను తాజాగా కోర్టుకు సమర్పించడం గమనార్హం. -
రాజ్యసభ ఎంపీపై చార్జిషీటు
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో రెండో చార్జిషీటును సీబీఐ దాఖలు చేసింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఈ చార్జిషీటులో రాజ్యసభ సభ్యుడు విజయ్ దార్దా, నాగపూర్‌కు చెందిన ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ డైరెక్టర్లు, ఇతరుల పేర్లు ఉన్నాయి. విజయ్ దార్దా తనయుడు దేవేంద్ర, ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ డైరెక్టర్లు అరవింద్ కుమార్ జైశ్వాల్, మనోజ్ జైశ్వాల్, రమేష్ జైశ్వాల్‌లతో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన గుర్తుతెలియని అధికారులను నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 120బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం) కింద దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. సీబీఐ తన మొట్టమొదటి చార్జిషీటును ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నవభారత్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌పై దాఖలు చేసిన సంగతి తెలిసిందే.