న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కేసులపై విచారణ జరుపుతున్న రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జడ్జి ఎంకే నాగ్‌పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియమితులయ్యారు. ఇక నుంచి ఢిల్లీ లిక్కర్ కేసును కావేరి భావేజా విచారించనున్నారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే ఢిల్లీ హయ్యర్ జ్యూడీషియల్ సర్వీసెస్‌కు చెందిన మరో 27 మంది న్యాయమూర్తులను(నాగ్‌పాల్‌తో సహా) ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. మరోవైపు ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్ (డీజేఎస్)కి చెందిన 31 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు.
కాగా జస్టిస్ నాగ్‌పాల్‌మద్యం పాలసీ కేసును ప్రారంభం నుంచి విచారిస్తున్నారు. నాగ్‌పాల్ ఇక నుంచి ఢిల్లీ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వంటి పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. సిసోడియా, సింగ్ జ్యూడీషియల్ కస్టడీలో ఉండగా.. కవిత ఈడీ రిమాండ్‌లో ఉన్నారు.
చదవండి: MLC Kavitha: మూడో రోజు ఈడీ విచారణ
Comments
Please login to add a commentAdd a comment