Judge Transfer
-
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిగ్ ట్విస్ట్..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కేసులపై విచారణ జరుపుతున్న రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జడ్జి ఎంకే నాగ్‌పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియమితులయ్యారు. ఇక నుంచి ఢిల్లీ లిక్కర్ కేసును కావేరి భావేజా విచారించనున్నారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఢిల్లీ హయ్యర్ జ్యూడీషియల్ సర్వీసెస్‌కు చెందిన మరో 27 మంది న్యాయమూర్తులను(నాగ్‌పాల్‌తో సహా) ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. మరోవైపు ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్ (డీజేఎస్)కి చెందిన 31 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు. కాగా జస్టిస్ నాగ్పాల్మద్యం పాలసీ కేసును ప్రారంభం నుంచి విచారిస్తున్నారు. నాగ్‌పాల్ ఇక నుంచి ఢిల్లీ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వంటి పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. సిసోడియా, సింగ్ జ్యూడీషియల్ కస్టడీలో ఉండగా.. కవిత ఈడీ రిమాండ్‌లో ఉన్నారు. చదవండి: MLC Kavitha: మూడో రోజు ఈడీ విచారణ -
సల్మాన్ ఖాన్‌కు మరో షాక్
జోధ్‌పూర్ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరో షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌పై సంగ్దిగ్ధం నెలకొంది. శనివారం పిటిషన్ విచారణకు రావాల్సి ఉండగా.. రాజస్థాన్ హైకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. జోధ్‌పూర్ జిల్లా మరియు సెషన్స్ జడ్జిని బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సల్మాన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటున్న సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 87 మంది జడ్జిలను ట్రాన్స్ఫర్ చేస్తూ హైకోర్టు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సల్మాన్ బెయిల్ పిటిషన్ వాయిదా పడినట్లేనని.. ఆయన మరిన్ని రోజులు జైల్లోనే గడపాల్సి ఉంటుందని న్యాయ నిపుణలు చెబుతున్నారు. నిజానికి సల్మాన్‌కు శిక్ష ప్రకటించిన రోజే (గురువారం) బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసుపై మరోసారి పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే ఆయనకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అన్నది నిర్ధారిస్థానని జడ్జి జోషి తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం సల్మాన్‌కు బెయిల్ వస్తుందని అంతా భావించారు. (సల్మాన్‌కు శిక్ష హ్యాపీగా ఉంది : నటి) ప్రస్తుతం జోషి స్థానంలో చంద్ర కుమార్ సొంగారాను జడ్జిగా బదిలీ చేశారు. చంద్ర కుమార్ తీసుకునే నిర్ణయంపైనే సల్మాన్ బెయిల్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయమై న్యాయమూర్తిని కలిసి విజ్ఞప్తి చేస్తామని సల్మాన్ తరపు న్యాయవాది చెబుతున్నారు. 1998లో హమ్ సాథ్ సాథ్ హై చిత్ర షూటింగ్ సందర్భంగా రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌పై మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి. సుమారు 20 ఏళ్ల విచారణ తర్వాత జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు సల్మాన్‌కు ఐదేళ్ల శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. (సల్మాన్ కేసు.. మతం రంగు) -
పలువురు జడ్జిల బదిలీ
హైదరాబాద్ ఎంఎస్‌జేగా రాధారాణి సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఏడుగురు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ ఉమ్మడి హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా పనిచేస్తున్న పి.శ్రీసుధ.. హైదరాబాద్ సిటి సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా బదిలీ అయ్యారు. మొన్నటివరకు ఆ స్థానంలో ఉన్న ఎన్ .బాలయోగి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం ఆ పోస్టును శ్రీసుధతో భర్తీ చేశారు. అలాగే ఆదిలాబాద్ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి జి.ఉదయగౌరి హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బదిలీ అయ్యారు. మొన్నటివరకు ఆ స్థానంలో ఉన్న జి.ఉమాదేవి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. న ల్లగొండ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న జి.రాధారాణి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే)గా బదిలీ అయ్యారు. మొన్నటివరకు ఆ స్థానంలో ఉన్న తెల్లప్రోలు రజిని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మెదక్ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి ఎం.వి.రమణనాయుడు తెలంగాణ వ్యాట్ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా బదిలీ అయ్యారు. గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి సి.సుమలత ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అనంతపురం ప్రిన్సిపల్ జిల్లా, సెషన్ ్ జడ్జి ఎ.హరిహరనాథశర్మ గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. జ్యుడీషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్ ఎన్ .నర్సింగరావు గుంటూరు మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారందరూ ఇప్పటికే రిజర్వు చేసుకున్న తీర్పులను, ఉత్తర్వులను వెలువరించి ఆ తర్వాత కొత్త బాధ్యతలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది.