హైదరాబాద్ ఎంఎస్‌జేగా రాధారాణి
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఏడుగురు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ ఉమ్మడి హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా పనిచేస్తున్న పి.శ్రీసుధ.. హైదరాబాద్ సిటి సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా బదిలీ అయ్యారు. మొన్నటివరకు ఆ స్థానంలో ఉన్న ఎన్ .బాలయోగి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం ఆ పోస్టును శ్రీసుధతో భర్తీ చేశారు. అలాగే ఆదిలాబాద్ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి జి.ఉదయగౌరి హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బదిలీ అయ్యారు. మొన్నటివరకు ఆ స్థానంలో ఉన్న జి.ఉమాదేవి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. న
ల్లగొండ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న జి.రాధారాణి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే)గా బదిలీ అయ్యారు. మొన్నటివరకు ఆ స్థానంలో ఉన్న తెల్లప్రోలు రజిని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. మెదక్ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి ఎం.వి.రమణనాయుడు తెలంగాణ వ్యాట్ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా బదిలీ అయ్యారు. గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి సి.సుమలత ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
అనంతపురం ప్రిన్సిపల్ జిల్లా, సెషన్ ్ జడ్జి ఎ.హరిహరనాథశర్మ గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. జ్యుడీషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్ ఎన్ .నర్సింగరావు గుంటూరు మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారందరూ ఇప్పటికే రిజర్వు చేసుకున్న తీర్పులను, ఉత్తర్వులను వెలువరించి ఆ తర్వాత కొత్త బాధ్యతలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది.