పాట్నా: బిహార్‌లోని 20 ఏళ్ల విద్యార్థిని రియా కూమారి ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ భమ్రాని శానిటర్‌ప్యాడ్స్ గురించి ప్రశ్నించిన సంగతి తెలిసింది. ఐతే ఆమె ఇచ్చిన వివరణ వివాదాస్పదమవ్వడంతో ఆమె పలు విమర్శలను ఎదుర్కొన్నారు కూడా. ఐతే ఆ విద్యార్థిని ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఏడాది పాటు శానిటరీ ప్యాడ్‌లను అందించడానికి ముందుకు వచ్చింది ఢిల్లీకి చెందిన శానిటరీ తయారీ సంస్థ పాన్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ మేరకు ఆ తయారీ సంస్థ సీఈవో చిరాగ్ మాట్లాడుతూ..ఈ విషయాల గురించి మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రారు.
పైగా అది మాట్లాడకూడని నిషిద్ధ అంశంగా చూస్తారు. అమ్మాయిలంతా ఆమెలా ధైర్యంగా ముందుకు వచ్చి బహిరంగా మాట్లాడాలి. నిజంగా రియా ధ్యైర్యానికి హ్యాట్సాప్. అని ఆమెని ప్రశంసించారు చిరాగ్. అంతేగాదు ఆమె గ్రాడ్యుయేషన్ చదువుకు అయ్యే ఖర్చును కూడా తామే భరిస్తామని చెప్పారు. ఐతే రియా మాత్రం... తన ప్రశ్న తప్పు కాదు కానీ మేడమ్ (ఐఏఎస్ ఆఫీసర్ హర్జోత్ కౌర్ భుమ్రా) మరోలా తీసుకున్నారని చెప్పింది. అంతేగాదు ఆమె ప్రతిదానికి ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం ఆధారితంగా ఉండాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా బహుశా ఆమె అలా అన్నారేమో కాబోలు అని చెబుతోంది.
ఇదిలా ఉండగా బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ....బిహార్ ప్రభుత్వం 'కన్యా ఉత్థాన్' కార్యక్రమం కింద ప్రతి అమ్మాయికి రూ.300/లు అందజేస్తుంది. అంటే ప్రతి అమ్మాయికి ప్రభుత్వం ప్రతి నెల రూ. 25లు చెల్లిస్తున్నట‍్లని, కానీ ఈ అమ్మాయి మాత్రం శానిటర్ ప్యాడ్స్ కోసం డిమాండ్ చేస్తోందన్నారు. బహుశా ఈ విషయం ఆ అమ్మాయికి, ఆ ఐఏఎస్ అధికారికి తెలియకపోయి ఉండొచ్చు అన్నారు.
ఆ విద్యార్థిని సాశక్త్ బేటీ.. సమృద్ధి బీహార్ పేరుతో జరిగిన వర్క్‌షాప్‌లో ఐఎఏస్ అధికారిని హర్జోత్ కౌర్ భమ్రాని ఈ విషయమై ఆమె ప్రశ్నించింది. ప్రభుత్వం యూనిఫాంలు వంటివి ప్రతీది ఉచితంగా ఇస్తోంది కదా అలానే రూ. 20-30లు ఉండే ఈ శానిటరీ ప్యాడ్స్‌ని ఉచితంగా ఇవ్వలేదా? అని ప్రశ్నించింది. ఐతే కలెక్టర్ కాస్త కటువుగా ఆ విద్యార్థి ప్రశ్నకు బదులివ్వడంతో ఇంత పెద్ద చర్చకు దారితీసింది.
(చదవండి: ‘కండోమ్’ వ్యాఖ్యలతో చిక్కుల్లో ఐఏఎస్.. చర్యలకు సీఎం ఆదేశం!)
Comments
Please login to add a commentAdd a comment