
పట్నా: బిహార్ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పట్నాలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన్ ఆక్రోశ్ ర్యాలీకి తేజస్వీ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బట్టతల ఉన్నవారికి 2014లో మోదీ దువ్వెనలు అమ్మారు. జుట్టు లేకున్నా మాకు దువ్వెలు ఎందుకని వారు అడిగితే.. నేను అధికారంలోకి రాగానే మీకు జుట్టు తెప్పిస్తా అని మోదీ చెప్పారు. మోదీ మంచి సేల్స్‌మెన్’’ అని తేజస్వీ ఎద్దేవా చేశారు.
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి దేశంలో లేదని, మోదీని ఎవరు నమ్మరని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరైన ఈ సభలో తేజస్వీ ఆయనతో పాటు వేదికను పంచుకున్నారు. మోదీ అసలు రంగును బిహార్ నిరుద్యోగులకు వివరించడానికి రాహుల్ ఇక్కడి రావడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీ ఒడించేందుకు కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిగా పోరాడుతామని తేజస్వీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment