రావణుడిగా సీఎం.. రాముడిగా ప్రతిపక్షనేత | Bihar CM Nitish Kumar As Rawan RJD Launched A Poster | Sakshi
Sakshi News home page

రావణుడిగా సీఎం.. రాముడిగా ప్రతిపక్షనేత

Published Fri, Oct 19 2018 3:29 PM | Last Updated on Fri, Oct 19 2018 3:29 PM

Bihar CM Nitish Kumar As Rawan RJD Launched A Poster - Sakshi

పట్నా : దసరా పండుగ సందర్భంగా బిహార్‌లో ఆర్జేడీ ఏర్పాటు చేసిన ఓ పోస్టర్‌ రాజకీయంగా దుమారం రేపుతోంది. జేడీయూ అధినేత, బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ను రావణుడిగా, ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్‌ను రాముడిగా చిత్రీకరిస్తూ ఆర్జేడీ పోస్టర్‌ను ఆవిష్కరించింది. తేజస్వీ ఇంటి సమీపంలోనే ఏర్పాటు చేసిన ఈ పోస్టర్‌పై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వార్‌ నడుస్తోంది. నితీష్‌ కుమార్‌ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేశారని, ప్రజలకు ఆయనపై ఉన్న కోపంతోనే ఈ పోస్టర్‌ను తయారు చేశారని తేజస్వీ పేర్కొన్నారు. ఆర్జేడీ తీరుపై అధికార పక్షం తీవ్రంగా మండిపడుతోంది. సీఎం స్థాయిని దిగజార్చే విధంగా పోస్టర్‌ ఉందని మండిపడుతోంది.

ఈ నెల 21 నుంచి తేజస్వీ నాలుగో విడత  ‘‘సంవిధాన్‌ బచావో న్యాయ్‌ యాత్ర’ను  ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఆర్జేడీ మద్దతుదారులు ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేశారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా దీనిపై జేడీయూ మిత్రపక్షం బీజేపీ ఇప్పటి వరకూ ఏలాంటి ప్రకటన చేయకపోగా.. కాంగ్రెస్‌ మాత్రం ఈ పోస్టర్‌పై భిన్నంగా స్పందించింది. రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తిని రావణుడిగా చిత్రీకరించడం సరైంది కాదని కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయపడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement