law and order situation
-
Haryana communal violence: బలగాల్ని దింపండి
న్యూఢిల్లీ: దేశ రాజధాని సమీపంలోని హరియాణాలో మత ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా చూడాలని పోలీసులకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. హరియాణాలో మత ఘర్షణలకు నిరసనగా వీహెచ్‌పీ, బజరంగ్దళ్ ఢిల్లీలో తలపెట్టిన ర్యాలీలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టీల సుప్రీంకోర్టు ధర్మాసనం పైవిధంగా ఆదేశాలిచ్చింది. నూహ్ జిల్లాలో జలై 31వ తేదీన వీహెచ్‌పీ ర్యాలీని అడ్డుకునేందుకు వేరే వర్గం వారు రాళ్లు రువ్వడంతో రాష్ట్రంలో చెలరేగిన మత ఘర్షణల్లో ఇప్పటిదాకా ఆరుగురు చనిపోయారు. ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో వీహెచ్‌పీ ర్యాలీల్లో విద్వేష ప్రసంగాలు జరక్కుండా కట్టడిచేయాలని పాలనా యంత్రాంగానికి సుప్రీంకోర్టు సూచించింది. సున్నితమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసి పర్యవేక్షించాలని, సంబంధిత సీసీటీవీ ఫుటేజీ, వీడియో రికార్డింగ్‌లను భద్రపరచాలని ఆదేశించింది. ‘ ఢిల్లీని ఆనుకుని ఉన్న హరియాణా, యూపీ ప్రాంతాల్లోనూ ర్యాలీలు జరగొచ్చు. అవసరమైతే అదనపు పోలీసు, పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపండి. ఎలాంటి ఆస్తి నష్టం, హింస జరగకుండా చూడండి. ఏ మతానికి వ్యతిరేకంగానైనా విద్వేష ప్రసంగాలు జరక్కుండా అడ్డుకట్టవేయండి’ అని కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం ఆదేశించింది. ఈ ఉత్తర్వులు పాలనాయంత్రాగాలకు త్వరగా అందేలా చూడాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సూచించింది. ‘విద్వేష ప్రసంగాలు చేసినపుడు ఫిర్యాదు కోసం వేచిచూడకుండా వెంటనే క్రిమినల్ కేసు నమోదుచేయాలని గత ఏడాది అక్టోబర్ 21న ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడూ యథాతథంగా అమలుచేయండి’ అని కోర్టు గుర్తుచేసింది. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిరంతరం యంత్రాంగాలతో సంప్రదించాలని కేంద్రానికి సూచించింది. పలుచోట్ల ర్యాలీలు ఢిల్లీ, సమీప ప్రాంతాల్లో 23 భారీ ర్యాలీలు చేపడతామన్న వీహెచ్‌పీ, బజరంగ్దళ్ పిలుపుమేరకు బుధవారం ఢిల్లీలో పలుచోట్ల ర్యాలీలు జరిగాయి. ట్రాఫిక్ స్తంభించింది. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు భద్రతను పెంచారు. నిర్మాణ్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద బజరంగ్దళ్ శ్రేణులు హనుమాన్ చాలీసా పఠించారు. వికాస్‌మార్గ్ ప్రాంతం ముట్టడికి ప్రయత్నించిన వారిని పోలీసులు చెదరగొట్టారు. 116 అరెస్టులు: ఖట్టర్ రాష్ట్రంలో మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటిదాకా 41 ఎఫ్ఐఆర్లు నమోదుచేసి 116 మందిని అరెస్ట్చేశామని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణస్థితికి చేరుకుందన్నారు. లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని హరియణా సర్కార్ ఏర్పాటుచేసేపనిలో ఉంది. -
మేము వచ్చాకే నడిరోడ్లపై నమాజ్ ఆగింది: సీఎం యోగి
ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం యోగి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సీఎం యోగి మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కంట్రోలోనే ఉన్నాయని తెలిపారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని అన్నారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈద్ సందర్భంగా వీధుల్లో ప్రార్థనలు చేయడం ఆగిపోయిందని అన్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా ఈద్‌కు నమాజ్, జుమాలను రహదారిపై నిర్వహించబడలేదని అన్నారు. అలాగే మతపరమైన ప్రదేశాల నుండి లౌడ్ స్పీకర్లను కూడా తొలగించినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రామ నవమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో మత ఘర్షణలు జరగలేదని గుర్తు చేశారు. యూపీలో ఈసారి రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. అలాగే, గోవుల కోసం గోశాలను నిర్మించినట్టు తెలిపారు. ఇక, తాను సీఎం అయినప్పటి నుంచి(2017) యూపీలో ఎక్కడా అల్లర్లు చోటుచేసుకోలేదని వెల్లడించారు. గతంలో ముజఫర్‌నగర్, మీరట్, మొరాదాబాద్ తదితర ప్రాంతాల్లో అల్లర్లు జరిగేవని.. నెలల తరబడి కర్ఫ్యూలు ఉండేవని.. అయితే తన పాలనలో మాత్రం అల్లర్లు జరగలేదన్నారు. అలాగే, యూపీలో మతపరమైన స్థలాలను నిర్మించడంతో పాటుగా పలు దేవాలయాలను పునర్నిర్మించమని తెలిపారు. ఇది కూడా చదవండి: బీజేపీకి ఊహించని షాక్ -
ఏపీలో కుట్రలకు పాల్పడితే కఠిన చర్యలు: డీజీపీ
సాక్షి, విజయవాడ: మత సామరస్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కుట్రపూరిత చర్యలకు పాలడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రతాచర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, నిరంతరం పరివ్యేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఎస్పీలను అప్రమత్తం చేశామని తెలిపారు గౌతం సవాంగ్. (చదవండి: తప్పుడు ఆరోపణలు ఉపేక్షించం) రాజకీయ లబ్ధి కోసమే గుడివాడ ఘటన: రవీంద్రనాథ్ బాబు నిరాదరణ ఆరోపణలతో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు హెచ్చరించారు. గుడివాడలో జరిగిన సంఘటన రాజకీయ లబ్ధి కోసమే జరిగింది అన్నారు. నిరాదరణ ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తాగుడుకి బానిసలైన ఇద్దరు వ్యక్తులు మద్యం కొనడానికి అవసరమైన డబ్బుల కోసం హుండీని బద్దలు కొట్టారని విచారణలో వెల్లడించారన్నారు. హుండీలో 600 రూపాయలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలిపారు. జిల్లాలో ఉన్న మతాలకు సంబంధించిన అన్ని ప్రార్థనామందిరాల దగ్గర తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చాలని సూచించామన్నారు. ప్రశాంతంగా ఉన్న మతాల మధ్య వివాదాలు రాజేసి వ్యక్తిగత, రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటే చర్యలు తప్పవని రవీంద్రనాథ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. -
రాష్ట్రంలో ఆటవికపాలన: తేజస్వీ యాదవ్
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించిపోయాయని, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా సీఎం మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. గయా జిల్లాలో తల్లికూతుళ్ళుపై గురువారం కొంతమంది యువకులు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నా సీఎం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని రాష్ట్రానికిది సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో ఆటవికపాలన సాగుతోందని, ప్రస్తుత పరిస్థితిపై గవర్నర్ జోక్యం చేసుకుని శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నా సీఎం నితీష్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కాగా గయాలో జరిగిన ఘటన నేపథ్యంలో 20 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సీ రాజీవ్ మిశ్రా తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఓ పోలీస్ అధికారిని విధుల్లో నుంచి తొలగించినట్లు ఎస్పీ ప్రకటించారు. -
'ఇంటర్ నెట్' ను నిషేధించడం కరెక్టే..!
న్యూఢిల్లీ: ఇంటర్ నెట్ సేవలను రద్దు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఇంటర్ నెట్ సర్వీసులను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పిచ్చింది. ఇంటర్నెట్ వినియోగం, రద్దు అంశంపై రాష్ట్రాల అధికారాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాం నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఆ పిల్ ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. సీఆర్పీసీ సెక్షన్ 144, టెలిగ్రాఫ్ సెక్షన్ 5ల కింద ఇంటర్ నెట్ వాడకాన్ని రద్దు చేయడంపై ఇటీవలే పిల్ దాఖలైంది. ఇంటర్ నెట్ రద్దు చేయకుండా కాస్త సడలింపు చేయాలని పిల్ లో పేర్కొన్నారు. అయితే, శాంతి భద్రతలకు భంగం కలుగుతుందేమో అన్న అనుమానం వస్తే ఇంటర్ నెట్ సేవల్ని రద్దుచేసే అధికారం ప్రభుత్వాలకు ఉందని తీర్పిచ్చింది. ఉదాహరణకు గతంలో పటిదార్ ఉద్యమం సమయంలో గుజరాత్ లో ఇంటర్ నెట్ సేవల్ని ఆపేసినట్లు తన తీర్పులో భాగంగా మేజిస్ట్రేట్ వివరించారు.