మేము వచ్చాకే నడిరోడ్లపై నమాజ్‌ ఆగింది: సీఎం యోగి | Yogi Adityanath Comments On Law And Order In UP | Sakshi
Sakshi News home page

మేము వచ్చాకే రోడ్లపై నమాజ్‌ చేయడం ఆగిపోయింది: సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

Published Mon, May 23 2022 10:40 AM | Last Updated on Mon, May 23 2022 10:57 AM

Yogi Adityanath Comments On Law And Order In UP - Sakshi

ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రెండోసారి ముఖ‍్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం యోగి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

తాజాగా సీఎం యోగి మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కంట్రోలోనే ఉన్నాయని తెలిపారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుప‌డ్డాయని అన్నారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈద్ సందర్భంగా వీధుల్లో ప్రార్థనలు చేయడం ఆగిపోయిందని అన్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా ఈద్‌కు నమాజ్, జుమాల‌ను రహదారిపై నిర్వహించబడలేద‌ని అన్నారు. అలాగే మతపరమైన ప్రదేశాల నుండి లౌడ్ స్పీకర్లను కూడా తొలగించినట్టు పేర్కొన్నారు. 

ఈ క్రమంలోనే రామ నవమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో మత ఘర్షణలు జరగలేదని గుర్తు చేశారు. యూపీలో ఈసారి రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. అలాగే, గోవుల కోసం గోశాలను నిర్మించినట్టు తెలిపారు. ఇక, తాను సీఎం అయినప్పటి  నుంచి(2017) యూపీలో ఎక్కడా అల్లర్లు చోటుచేసుకోలేదని వెల్లడించారు. గతంలో ముజఫర్‌నగర్‌, మీరట్‌, మొరాదాబాద్‌ తదితర ప్రాంతాల్లో అల్లర్లు జరిగేవని.. నెలల తరబడి కర్ఫ్యూలు ఉండేవని.. అయితే తన పాలనలో మాత్రం అల్లర్లు జరగలేదన్నారు. అలాగే, యూపీలో మతపరమైన స్థలాలను నిర్మించడంతో పాటుగా ప‌లు దేవాల‌యాల‌ను పునర్నిర్మించమ‌ని తెలిపారు. 

ఇది కూడా చదవండి: బీజేపీకి ఊహించని షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement