srirama navavami
-
మేము వచ్చాకే నడిరోడ్లపై నమాజ్ ఆగింది: సీఎం యోగి
ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం యోగి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సీఎం యోగి మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కంట్రోలోనే ఉన్నాయని తెలిపారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని అన్నారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈద్ సందర్భంగా వీధుల్లో ప్రార్థనలు చేయడం ఆగిపోయిందని అన్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా ఈద్‌కు నమాజ్, జుమాలను రహదారిపై నిర్వహించబడలేదని అన్నారు. అలాగే మతపరమైన ప్రదేశాల నుండి లౌడ్ స్పీకర్లను కూడా తొలగించినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రామ నవమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో మత ఘర్షణలు జరగలేదని గుర్తు చేశారు. యూపీలో ఈసారి రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. అలాగే, గోవుల కోసం గోశాలను నిర్మించినట్టు తెలిపారు. ఇక, తాను సీఎం అయినప్పటి నుంచి(2017) యూపీలో ఎక్కడా అల్లర్లు చోటుచేసుకోలేదని వెల్లడించారు. గతంలో ముజఫర్‌నగర్, మీరట్, మొరాదాబాద్ తదితర ప్రాంతాల్లో అల్లర్లు జరిగేవని.. నెలల తరబడి కర్ఫ్యూలు ఉండేవని.. అయితే తన పాలనలో మాత్రం అల్లర్లు జరగలేదన్నారు. అలాగే, యూపీలో మతపరమైన స్థలాలను నిర్మించడంతో పాటుగా పలు దేవాలయాలను పునర్నిర్మించమని తెలిపారు. ఇది కూడా చదవండి: బీజేపీకి ఊహించని షాక్ -
శ్రీరామ నవమి- ఫేమస్ పాటలివే
తండ్రి మాటను జవదాటని తనయుడిగా, సోదరులను అభిమానించిన అన్నగా, భార్య దూరమైనా నిరంతరం ఆమె కోసం పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా.. మనిషి ధర్మం తప్పకుండా ఎలా జీవించాలో చూపించాడు శ్రీరాముడు. జీవితంలో ఎదురైన సమస్యలను ధర్మమార్గంలో అధిగమిస్తూ జీవితంలో ఎలా ముందుకు నడవాలో ఆయనవేసిన అడుగులను చూస్తే స్పష్టమవుతుంది. శ్రీరామనవమి సందర్భంగా కొన్ని ‘సీతారాముల పాటలు’ ఇప్పుడు చూద్దాం. -
ఆర్జీవీ... ఓ రామబాణం
ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆర్జీవీ’. ‘కార్తికేయ’ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం, టారస్ సినీకార్ప్ సమర్పణలో మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ సినిమా నిర్మించనున్నారు. నేడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘ఆర్జీవీ’ చిత్రం టైటిల్ లోగో విడుదల చేసి, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు’ తన పిచ్చి ఇజంతో యువతను పెడదోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసఫీ మీద సంధించిన రామబాణమే ఈ సినిమా. అందుకే శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ చిత్రం టైటిల్ లోగో విడుదల చేశాం’’ అన్నారు. ‘‘కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు వెంకట శ్రీనివాస్ బొగ్గరం. సురేష్, రాశి, శ్రద్ధా దాస్, అమిత్, పునర్నవి భూపాలం, తేజ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: వేదాంత్ మల్లాది, సంగీతం: వీణాపాణి. -
'రామతీర్థంలోనే శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలి'
విజయనగరం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాలు రామతీర్థంలోనే నిర్వహించాలని వెయ్యి మంది భక్తులు శనివారం మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఉత్తరాంధ్ర సాధు పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ర్యాలీ దుర్గా థియోటర్ నుంచి రామతీర్థం వరకు కొనసాగింది. రామతీర్థంలోనే ఉత్సవాలు నిర్వహించాలని ర్యాలీ నిర్వాహకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలకు రామతీర్థం సరైనదని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా... శ్రీరామనవమి ఉత్సవాలను వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. (నెల్లిమర్ల)