'రామతీర్థంలోనే శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలి'
విజయనగరం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాలు రామతీర్థంలోనే నిర్వహించాలని వెయ్యి మంది భక్తులు శనివారం మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఉత్తరాంధ్ర సాధు పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ర్యాలీ దుర్గా థియోటర్ నుంచి రామతీర్థం వరకు కొనసాగింది. రామతీర్థంలోనే ఉత్సవాలు నిర్వహించాలని ర్యాలీ నిర్వాహకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలకు రామతీర్థం సరైనదని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా... శ్రీరామనవమి ఉత్సవాలను వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
(నెల్లిమర్ల)