ramateertham
-
అశోక్‌గజపతిరాజు వీరంగం
-
రామతీర్థం ఆలయానికి నేడు శంకుస్థాపన
-
విజయసాయిరెడ్డిపై దాడి కేసులో ఏ–1గా చంద్రబాబు
సాక్షి, నెల్లిమర్ల రూరల్: ఎంపీ విజయసాయిరెడ్డిపై దాడి కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏ–1 నిందితుడిగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల రెండో తేదీన విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వచ్చిన విజయసాయిరెడ్డి.. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలపై టీడీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అదే రోజు విజయసాయిరెడ్డి నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి బాధ్యులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావును పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు ఈ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరిన పోలీసులు
విజయనగరం: రామతీర్థంలో విజయసాయిరెడ్డి వాహనంపై దాడి కేసులో అరెస్ట్ అయిన ఏడుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు. నిందితులకు బెయిల్ లభిస్తే సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి వారికి బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కోర్టును కోరారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా కొందరిని విచారించాల్సి ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కాగా, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రామతీర్ధం సందర్శన సందర్భంగా టీడీపీ, బీజేపీ శ్రేణులు ఆయన వాహనంపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేసిన ఘటనలో నెలిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితుల్లో ఒకరైన టీడీపీ నేత కళా వెంకటరావును అరెస్ట్ చేసి ఆతర్వాత విడుదల చేశారు. ఇదే కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా కళా వెంకటరావు ఉన్నారు. -
రూ.3 కోట్లతో రామతీర్థం ఆలయ పునఃనిర్మాణం
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీరామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి, పునఃనిర్మాణానికి మూడుకోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఆయన సోమవారం దేవదాయశాఖ కార్యదర్శి గిరిజాశంకర్, ప్రత్యేక కమిషనర్ అర్జునరావు, ఆర్జేసీ భ్రమరాంబ, ఎస్ఈ శ్రీనివాస్‌తో సమావేశం నిర్వహించారు. 700 అడుగుల ఎత్తులో కొండపై ఉన్న స్వామి ఆలయాన్ని పూర్తిగా రాళ్లతోనే పునఃనిర్మించాలని నిర్ణయించారు. ఒకటి రెండు నెలల ముందు వరకు కనీసం విద్యుత్ సౌకర్యం లేని ఈ ఆలయ పరిసరాల్లో పునఃనిర్మాణ ప్రక్రియలో భాగంగా విద్యుత్ దీపాలంకరణ చేయాలని, కొండపైన శాశ్వత నీటివసతిని కల్పించాలని, ఆలయ ప్రాకారం నిర్మించాలని నిర్ణయించారు. కొత్తగా హోమశాల, నివేదనశాల నిర్మించటంతోపాటు ధ్వజస్తంభం ప్రతిష్టించాలని నిర్ణయించారు. కొండపైన ఆలయం వద్ద సహజ సిద్ధంగా ఉన్న కోనేటిని పూర్తిస్థాయిలో ఆధునికీకరించి దాని చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, ఆలయం వద్దకు వెళ్లేందుకు ఇప్పుడున్న ఇరుకు మెట్ల మార్గాన్ని బాగా వెడల్పు చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 13న అంతర్వేది ఆలయ రథప్రతిష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణం వేగంగా పూర్తయింది. ఫిబ్రవరి 13న కొత్తగా నిర్మించిన రథానికి అభిషేకం, పుర్ణాహుతి, రథప్రతిష్ట కార్యక్రమాలను దేవదాయశాఖ అధికారులు నిర్వహించనున్నారు. మూడురోజుల పాటు నూతన రథానికి వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం సంప్రోక్షణ చేస్తారు. 11న సంకల్పం, 12న అధివాస కార్యక్రమం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది. 23న స్వామి ఊరేగింపును కొత్త రథంపై నిర్వహిస్తారు. -
పోలీస్ శాఖ హై అలర్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆలయాల వ్యవహారంపై పోలీస్ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే మతపరమైన సంస్థలు, ఆలయాల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తున్న పోలీస్ శాఖ మరిన్ని పక్కా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేసినట్టు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను ఆయన ఆదివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. దేవాలయాలపై ఈ రకమైన ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మతసామరస్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతున్నట్టు గుర్తించామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను ఉపేక్షించేది లేదన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పెట్రోలింగ్, బందోబస్తులతో విజిబుల్ పోలీసింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఆలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. అర్చకులు, ఆలయ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మన సంప్రదాయాలను గౌరవిస్తూ దేవాలయాలను కాపాడుకునేందుకు శ్రద్ధ వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని, డయల్ 100కు ఫోన్ ద్వారా చెప్పాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రత చర్యలు పర్యవేక్షించాలని, నిరంతరం నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలిచ్చామన్నారు. దేవాలయాల ఘటనలపై పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖలను అప్రమత్తం చేశామని, వాటి సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే చాలా ఆలయాలకు జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మిగిలిన వాటిలోనూ త్వరితగతిన ఏర్పాటు చేస్తామన్నారు. ‘రామతీర్థం’ నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం! విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం కేసు దర్యాప్తునకు సంబంధించి డీఐజీ కేఎల్ కాంతారావు ఆదివారం విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి, ఇతర ముఖ్య అ«ధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ కేసులో నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి 20 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
'రామతీర్థంలోనే శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలి'
విజయనగరం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాలు రామతీర్థంలోనే నిర్వహించాలని వెయ్యి మంది భక్తులు శనివారం మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఉత్తరాంధ్ర సాధు పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ర్యాలీ దుర్గా థియోటర్ నుంచి రామతీర్థం వరకు కొనసాగింది. రామతీర్థంలోనే ఉత్సవాలు నిర్వహించాలని ర్యాలీ నిర్వాహకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలకు రామతీర్థం సరైనదని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా... శ్రీరామనవమి ఉత్సవాలను వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. (నెల్లిమర్ల)