'ఇంటర్ నెట్' ను నిషేధించడం కరెక్టే..! | Supreme Court allows states to suspend internet services | Sakshi
Sakshi News home page

'ఇంటర్ నెట్' ను నిషేధించడం కరెక్టే..!

Published Thu, Feb 11 2016 12:57 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

'ఇంటర్ నెట్' ను నిషేధించడం కరెక్టే..! - Sakshi

'ఇంటర్ నెట్' ను నిషేధించడం కరెక్టే..!

న్యూఢిల్లీ: ఇంటర్ నెట్ సేవలను రద్దు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఇంటర్ నెట్ సర్వీసులను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పిచ్చింది. ఇంటర్నెట్ వినియోగం, రద్దు అంశంపై రాష్ట్రాల అధికారాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాం నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.

ఆ పిల్ ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. సీఆర్పీసీ సెక్షన్ 144, టెలిగ్రాఫ్ సెక్షన్ 5ల కింద ఇంటర్ నెట్ వాడకాన్ని రద్దు చేయడంపై ఇటీవలే పిల్ దాఖలైంది. ఇంటర్ నెట్ రద్దు చేయకుండా కాస్త సడలింపు చేయాలని పిల్ లో పేర్కొన్నారు. అయితే, శాంతి భద్రతలకు భంగం కలుగుతుందేమో అన్న అనుమానం వస్తే ఇంటర్ నెట్ సేవల్ని రద్దుచేసే అధికారం ప్రభుత్వాలకు ఉందని తీర్పిచ్చింది. ఉదాహరణకు గతంలో పటిదార్ ఉద్యమం సమయంలో గుజరాత్ లో ఇంటర్ నెట్ సేవల్ని ఆపేసినట్లు తన తీర్పులో భాగంగా మేజిస్ట్రేట్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement