న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే విధానపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిహార్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కుల గణనకు సంబంధించిన తదుపరి సమాచారాన్ని బహిర్గతం చేయకుండా తాము నిరోధించలేమని వెల్లడించింది. కుల గణన డేటాను ఎందుకు ప్రచురించాల్సి వచ్చిందో చెప్పాలని బిహార్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. కుల గణన చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందో లేదో పరిశీలిస్తామని తెలియజేసింది.
బిహార్‌లో కుల గణనకు అనుమతి ఇస్తూ ఆగస్టు 1న బిహార్ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీన్ భట్టీతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కులాల వారీగా సర్వేకు సంబంధించిన కొన్ని వివరాలను ప్రభుత్వం ప్రచురించిందని, మిగిలిన వివరాలకు బయటపెట్టకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేయగా, ధర్మాసనం అందుకు నిరాకరించింది. విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment