న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేపట్టిన కులగణన సర్వే తదుపరి డేటాను ప్రచురించకుండా బిహార్ ప్రభుత్వాన్ని అడ్డుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ మేరకు కులగణన సర్వే గోప్యత హక్కును ఉల్లంఘిస్తోందని, దీనిపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషిన్‌పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవడం సరికాదని తెలిపింది.
నలంద నివాసి అఖిలేష్ కుమార్, ఎన్జీవో 'ఏక్ సోచ్ ఏక్ పర్యాస్' సహా పలువురు వేసిన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ పిటిషనర్లు సుప్రీంకోర్టును అశ్రయించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది.
కులగణన సర్వేపై స్టే విధించలేదని సుప్రీంకోర్టు తెలిపింది. విధాన నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించడం తప్పు అని పేర్కొంది. ఈ మేరకు కుల గణనకు సంబంధించి తదుపరి వివరాలు వెల్లడించకుండా స్టే విధించాలన్న పిటిషనర్ల అభ్యంతరాలను కోర్టు తిరస్కరించింది. విధాన రూపకల్పనకు కులగణన డేటా ఎందుకు అవసరమో పాట్నా హైకోర్టు ఉత్తర్వుల్లో చాలా వివరంగా ఉన్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం పిటిషనర్లకు తెలియజేసింది.
చదవండి: ఎన్నికల ముందు ఉచితాలు.. ఆ రెండు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
కాగా 2024 లోక్‌సభ ఎన్నికల ముందు బిహార్ ప్రభుత్వం ఆక్టోబర్ 2న కులగణన సర్వే ఫలితాలను విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో 13.07 కోట్ల జనాభాలో 36 శాతం మంది అత్యంత వెనకబడిన వర్గాలు (ఈబీసీ) ఉన్నట్లు తెలిపింది. మూడున్నర కోట్లు (27 శాతం) ఇతర వెనకబడిన వర్గాలు(ఓబీసీలు) ఉన్నట్లు పేర్కొంది. 19.7శాతం షెడ్యూల్డ్ కులాలు, 1.7 శాతం షెడ్యూల్డ్ ట్రైబల్స్ ఉన్నట్లు వెల్లడిచింది.
అదే విధంగా జనరల్ క్యాటగిరీలో ఉన్న ఆధిపత్య కులాలు 15.5 శాతం అని కుల గణన చెబుతోంది. ఇక జనాభాలో హిందువులు 81.99 శాతం కాగా, ముస్లింలు 17.7 శాతం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, ఇతర మతాలవారూ ఒక శాతంలోపేనని నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment