న్యూఢిల్లీ: ఢిల్లీ, జిల్లా క్రికెట్ సంఘం(డీడీసీఏ)లో అక్రమాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై తాను చేసిన ఆరోపణలు వాస్తవాలని, వాటికి కచ్చితమైన ఆధారాలున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత రాఘవ్ చద్దాలు స్పష్టం చేశారు. తనపై, మరో ఐదుగురు ఆప్ నేతలపై జైట్లీ వేసిన పరువునష్టం దావాకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన నోటీసులకు మంగళవారం కేజ్రీవాల్ సమాధానమిచ్చారు.
డీడీసీఏ అక్రమాలపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్‌ను ఈ దావాలో భాగస్వామిని చేయకపోవడాన్ని కేజ్రీవాల్ ప్రశ్నించారు. తమ వాదనకు మద్దతుగా డీడీసీఏ వార్షిక భేటీ వివరాలను, ఫోన్ రికార్డులను వారు కోర్టుకు సమర్పించారు.
మా ఆరోపణలకు ఆధారాలున్నాయి: కేజ్రీవాల్
Published Wed, Jan 13 2016 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM
Advertisement
Advertisement