kirti azad
-
తెలివి తక్కువ వాళ్ల జోక్యం వద్దు.. కోహ్లి విషయంలో పట్టుబట్టిన రోహిత్!
టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో విరాట్ కోహ్లికి స్థానం ఉండబోదన్న వార్తలపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కీర్తి ఆజాద్ ఘాటుగా స్పందించాడు. జట్టు ఎంపిక విషయంలో తెలివితక్కువ వాళ్లు జోక్యం చేసుకోకపోతేనే బాగుంటుందని హితవు పలికాడు. ఎవరేమనుకున్నా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం.. కోహ్లి వరల్డ్‌కప్ జట్టులో ఉండాల్సిందేనని పట్టుబట్టినట్లు కీర్తి ఆజాద్ వెల్లడించాడు. కాగా యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసే క్రమంలో విరాట్ కోహ్లిని పక్కనపెట్టాలని టీమిండియా సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. బీసీసీఐ కార్యదర్శి జై షా ఆదేశాల మేరకు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ మేరకు గత వారం టెలిగ్రాఫ్ కథనం ప్రచురించగా.. బీసీసీఐ తీరుపై టీమిండియా, కోహ్లి అభిమానులు మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో ఐసీసీ ఈవెంట్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో 1983 వరల్డ్‌కప్ విజేత జట్టులోని సభ్యుడు కీర్తి ఆజాద్ ‘ఎక్స్’(ట్విటర్) వేదికగా తన కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘జై షా సెలక్టర్ కాదు కదా! కోహ్లికి టీ20 జట్టులో చోటు ఇవ్వకుండా అతడెందుకు అజిత్ అగార్కర్‌ను.. మిగతా సెలక్టర్లను కూడా ఇందుకు ఒప్పించమని అడుగుతాడు? జట్టు ఎంపిక కోసం మార్చి 15 వరకు సమయం ఇచ్చారట. సోర్సెస్ చెప్పినవే నిజమనుకుంటే.. కోహ్లి విషయంలో అజిత్ అగార్కర్ మిగతా సెలక్టర్లతో పాటు తనను తాను కూడా కన్విన్స్ చేయలేకపోయాడు. జై షా రోహిత్ శర్మను ఈ విషయం గురించి అడుగగా.. ఎట్టిపరిస్థితుల్లోనూ కోహ్లి జట్టులో ఉండాల్సిందే అని రోహిత్ స్పష్టం చేశాడు. ఈసారి టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లి కచ్చితంగా ఆడతాడు. జట్టు ఎంపిక ప్రకటన కంటే ముందే అధికారికంగా ఈ ప్రకటన వెలువడుతుంది. జట్టు ఎంపిక ప్రక్రియ విషయంలో తెలివితక్కువ వాళ్లు జోక్యం చేసుకోకూడదు’’ అని కీర్తి ఆజాద్ పేర్కొన్నాడు. కాగా జూన్‌లో వెస్టిండీస్-అమెరికా వేదికగా ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్-2024లో రోహిత్ శర్మనే టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కుమారుడు అకాయ్ జననం(ఫిబ్రవరి 15) నేపథ్యంలో విరాట్ కోహ్లి లండన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమైన అతడు.. ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున కోహ్లి ఐపీఎల్-2024 బరిలో దిగనున్నాడు. గత సీజన్లో ఈ రన్‌మెషీన్ 14 మ్యాచ్‌లు ఆడి 639 పరుగులు చేశాడు. చదవండి: T20 WC: టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్‌కప్‌లో నో ఛాన్స్! Why should Jay Shah, he is not a selector, to give responsibility to Ajit Agarkar to talk to the other selectors and convince them that Virat Kohli is not getting a place in the T20 team. For this, time was given till 15th March. If sources are to be believed, Ajit Agarkar was… pic.twitter.com/FyaJSClOLw — Kirti Azad (@KirtiAzaad) March 17, 2024 -
Kohli-Rohit: కలిసి ఆడకపోతే వాళ్లకే నష్టం.. జట్టులో ఎవరూ శాశ్వతం కాదు..!
Rohit Sharma-Virat Kohli: టీమిండియా కెప్టెన్లు విరాట్ కోహ్లి(టెస్ట్), రోహిత్ శర్మ(పరిమిత ఓవర్లు)లు కలిసి ఆడేందుకు సముఖంగా లేరని వస్తున్న వార్తలపై భారత మాజీ ఆటగాడు కీర్తి ఆజాద్ స్పందించాడు. కోహ్లి, రోహిత్‌లు కలిసి ఆడకపోతే జట్టుతో పాటు వాళ్లు కూడా నష్టపోతారని హెచ్చరించాడు. ఒకరి కెప్టెన్సీలో ఒకరు ఆడకపోవడం వల్ల తొలుత జట్టుకే నష్టం వాటిల్లినప్పటికీ.. ఆతర్వాత కొద్ది రోజులకే వాళ్ల కెరీర్లు కూడా ముగుస్తాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఎవరూ శాశ్వతం కాదని.. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ లాంటి చాలా మంది దిగ్గజాలు వచ్చారు, వెళ్లారు అని ఉదహరించాడు. ఈ సందర్భంగా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనపై స్పందించాడు. దక్షిణాఫ్రికాలోని హార్డ్ పిచ్‌లు ప్రపంచంలోని మిగతా పిచ్‌లకు భిన్నమని, అలాంటి పిచ్‌లపై అనుభవజ్ఞులైన కోహ్లి, రోహిత్‌ల అవసరం టీమిండియాకు ఎంతైనా ఉందని అన్నాడు. కీలక పర్యటనకు ముందు జట్టులో విభేదాలు ప్రత్యర్ధికి అనుకూలంగా మారడంతో పాటు ఘన చరిత్ర కలిగిన భారత క్రికెట్ పరువును బజారుకీడుస్తాయని వాపోయాడు. కాగా, దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్ క్యాంప్‌లో ప్రాక్టీస్ చేస్తూ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో అతను టెస్ట్ సిరీస్‌కు దూరమవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు రోహిత్ కెప్టెన్సీలో ఆడేందుకు ఇష్టం లేని కోహ్లి, కుమార్తె పుట్టినరోజును కారణంగా చూపి సెలవు కోరాడని, ఈ కారణంగా అతను వన్డేలకు దూరమవుతాడని వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఖండిస్తూ.. రోహిత్ సారధ్యంలో వన్డేలు ఆడేందుకు సిద్ధమేనంటూ కోహ్లి తాజాగా ప్రకటించాడు. చదవండి: Rohit-Virat: ఆట కంటే ఆటగాళ్లెవరూ గొప్ప కాదు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు -
‘ఐపీఎల్ అవసరమా.. ఇక ఆపాల్సిందే’
ఢిల్లీ: బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తున్న కరోనా కేసులు రావడంతో ఇక ఈ లీగ్‌ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ వినిపిస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ క్యాంప్‌లో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఆర్సీబీతో జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్‌లు ఎంతవరకూ జరుగుతాయనే సందిగ్థత ఏర్పడింది. మరొకవైపు మాజీ క్రికెటర్లు కూడా ఐపీఎల్‌ను ఆపితేనే మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ నిర్వహణ సాధ్యాసాధ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మాట్లాడుతూ.. ‘ నేను ముందుగా అనుకున్నది బయోబబుల్‌లో ఐపీఎల్‌ను జరుపుతున్నారు కాబట్టి కరోనా ఎఫెక్ట్ ఉండదనే అనుకున్నా క్రికెటర్లంతా సేఫ్‌గానే ఉంటారని భావించా. కానీ దురదృష్టవశాత్తూ బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్ నిర్వహిస్తున్నా క్రికెటర్లు కరోనా బారిన పడుతున్నారు. అంటే రక్షణ లేదనేది ఇక్కడ అర్థమవుతోంది. రాబోవు కాలంలో పరిస్థితులు కఠినంగా ఉండవచ్చు. మరి ఈ తరుణంలో ఐపీఎల్ అవసరమా.. ఇక ఆపండి’ అని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చదవండి: విరాళంపై రూటు మార్చిన కమిన్స్! ‘ఇకపై వార్నర్‌ను సన్‌రైజర్స్ జెర్సీలో చూడలేం’ -
‘రిషభ్ పంత్‌ను చూస్తే బాధేస్తోంది’
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్లో ఎంఎస్ ధోని వారసుడిగా కీపింగ్ బాధ్యతలు అందుకుని ఆందుకు తగ్గట్టుగానే ఆరంభంలో మెరిసిన యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు అవకాశాలు కోసం వేచి చూసే పరిస్థితి వచ్చింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో వికెట్ కీపర్ స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేయడంతో పంత్ వైపు టీమిండియా యాజమాన్యం కానీ సెలక్టర్లు కానీ చూడటం లేదు. గతంలో వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చిన సెలక్టర్లు.. ఉన్నపళంగా పంత్ ఊసే లేకుండా ఉన్నారు. దీనికి కారణం పంత్ స్వీయ తప్పిదమే అంటున్నాడు మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్. పంత్‌లో విపరీతమైన టాలెంట్ ఉన్నా గర్వంతోనే ప్రస్తుత పరిస్థితి తెచ్చుకున్నాడన్నాడు. (అలవాటులో పొరపాటు.. అంపైర్లకు తిప్పలు) ‘పంత్‌లో టాలెంట్‌కు కొదవలేదు. కానీ కాస్త టెంపరితనం తగ్గించాలి. హఠాత్తుగా తన బ్యాటింగ్‌ను మార్చుకుంటాడు. ప్రతీ బంతిని బౌండరీ దాటించాలనుకోవడం అతని చోటుకు చేటు చేసింది. వన్డే, టెస్టు ఫార్మాట్‌ను కూడా టీ 20 ఫార్మాట్లో ఆడాలంటే ఎలా. ఇది పంత్ మార్చుకోవాల్సి ఉంది. పంత్‌ను పక్కన కూర్చోబెట్టడంతో అతని టాలెంట్ వృథా అవుతుందనే చెప్పాలి. నువ్వు వికెట్ దగ్గర నిలబడటం నేర్చుకుంటే పరుగులు వాటంతటే అవే వస్తాయి. ముందు స్టైక్ రోటేట్ చేయడం అలవాటు చేసుకోవాలి. పంత్ కీపర్‌గా కంటే బ్యాట్స్‌మన్‌గాను మెరుగ్గా ఉన్నాడు. అయినా పూర్తి స్థాయి టాలెంట్‌ను బయటకు తీయలేకపోతున్నాడు. వచ్చిన అవకాశాల్లో అనవరసర తప్పిదాలు చేసి ఇప్పుడు చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. పంత్ మళ్లీ కచ్చితంగా అవకాశం ఇచ్చి చూడాలి. అతనికి ప్రత్యేకంగా ఒక స్థానాన్ని కూడా సెట్ చేస్తే మంచిది. పంత్ టాలెంట్ వేస్ట్ అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది’ అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి ఆజాద్ పేర్కొన్నాడు. -
కీర్తి ఆజాద్‌కు తప్పని ఓటమి
ధన్‌బాద్: ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున జార్ఖండ్‌లోని ధన్‌బాద్ లోక్‌సభ నియోజకం వర్గం నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ఘోర పరాజయం చవిచూశారు. బీజేపీ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ పశుపతినాథ్ సింగ్ చేతిలో కీర్తి ఆజాద్ సుమారు నాలుగు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆజాద్ మూడోసారి లోక్‌సభకు పోటీ చేయగా, గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున దర్భాంగా నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే తాజా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పశుపతినాధ్ సింగ్ ఎనిమిది లక్షలకు పైగా ఓట్లు సాధించగా, కీర్తి ఆజాద్ మూడు లక్షల నలభై వేల పైచిలుకు ఓట్లు మాత్రమే సాధించి భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ బీజేపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం. 1990 నుంచి ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీనే విజయం సాధించింది. బీజేపీ నుంచి ఫిరాయించిన కీర్తి ఆజాద్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించినప్పటికీ బీజేపీ ప్రభంజనం ముందు ఆయనకు ఓటమి తప్పలేదు. నాలుగేళ్ల క్రితం బీజేపీ నుంచి కీర్తి ఆజాద్ సస్పెన్షన్ గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఉందని కీర్తి ఆజాద్ ఆరోపణలు సంధించడంతో ఆయనపై వేటు పడింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2016లో ఆజాద్ భార్య పూనమ్ ఆప్ పార్టీలో చేరగా, 2017,ఏప్రిల్‌లో ఆమె కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 1980 నుంచి 1986 వరకూ భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. కుడిచేతి వాటం స్పిన్నర్ అయిన ఆజాద్..1983లో భారత్ వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఆయన 7 టెస్టులు, 25 వన్డేలు ఆడారు. -
కాంగ్రెస్‌లో చేరిన మాజీ క్రికెటర్
పట్నా: సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. మాజీ క్రికెటర్, బిహార్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కీర్తి ఆజాద్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. దర్బంగా లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికవుతూ వస్తున్న ఆజాద్ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. కాగా బీజేపీ నాయకత్వంలో విభేదించి ఆయన ఇటీవల ఆపార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై అవినీతి ఆరోపణలు చేసినందుకు బీజేపీ నుంచి వేటుకు గురైయారు. ఆజాద్‌ను దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పోటీలో నిలుపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సామాజిక వర్గానికి చెందిన పూర్వాంచాలీస్ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆజాద్‌ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ వ్యూహత్మకంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతంలో ఆయన ఢిల్లీలో గోలే మార్కెట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా భారత్ గెలిచిన 1983 వన్డే ప్రపంచకప్‌లో కీర్తి ఆజాద్ కూడా సభ్యుడన్న విషయం విధితమే. -
జైట్లీ అసమర్థుడు.. రాజీనామా చేయాలి: బీజేపీ ఎంపీ
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై బీజేపీ నుంచి సస్పెండయిన నాయకుడు, ఎంపీ కీర్తి ఆజాద్ మండిపడ్డారు. ఆర్థికమంత్రి అసమర్థుడని, పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య మానవులు ఎదుర్కొంటున్న సమస్యలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి అరుణ్ జైట్లీ చెడ్డపేరు తెస్తున్నారని, పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజల కష్టాలన్నింటికీ ఆయనే బాధ్యుడని మాజీ క్రికెటర్ కూడా అయిన కీర్తి ఆజాద్ చెప్పారు. అసలు ఆయన ఆర్థికవేత్త కానే కాదని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. పెద్దనోట్లను రద్దు చేయాలని ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్న తర్వాత నల్ల ధనాన్ని తెల్లగా మార్చడంలోనే బ్యాంకులు నిమగ్నమై ఉన్నాయని ఆజాద్ మండిపడ్డారు. బ్యాంకులు ఎవరి పరిధిలోకి వస్తాయని.. ఇవన్నీ కూడా ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోకే వస్తాయి కాబట్టి అక్కడ జరుగుతున్న అక్రమాలకు బాధ్యతగా ఆర్థికమంత్రి తప్పుకోవాలని బిహార్‌లోని దర్భాంగా స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎంపీ డిమాండ్ చేశారు. -
'ఆ పదవులపై ఎందుకంత వ్యామోహం'
నాగ్‌పూర్:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)పారదర్శకతలో భాగంగా జస్టిస్ లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలు మిగతా క్రీడల్లో అవసరమని బీజేపీ బహిష్కృత ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అభిప్రాయపడ్డారు. ఒక గేమ్‌లో పారదర్శకత కోసం లోధా ప్యానల్ చేసిన సిఫారుసులు క్రికెట్ కు ఎంత అవసరమో, అదే తరహా సూచనలు మిగతా క్రీడల్లో అనివార్యమని ఆజాద్ పేర్కొన్నారు. భారతదేశంలోని కొన్ని క్రీడా బోర్డులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయని ఆజాద్ విమర్శించారు. 'క్రీడలపై నమ్మకం ఉండాలి. అది క్రికెట్ అయినా, ఇంకా వేరే గేమ్ అయినా పారదర్శకత అవసరం. అందుకోసం లోధా తరహా ప్యానల్‌ను మిగతా క్రీడలకు కూడా ఏర్పాటు చేసి ప్రక్షాళనకు నడుంబిగించాల్సి అవసరం ఎంతైనా ఉంది' అని ఆజాద్ తెలిపారు. మరొకవైపు లోధా ప్యానల్ సూచనలపై బీసీసీఐ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయాల్సి వస్తుందో తనకు అర్ధం కావడం లేదన్నారు.అసలు లోధా సిఫారుసులను వ్యతిరేకించాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. క్రికెట్ గేమ్ అనేది ఆటగాళ్ల వల్లే ఖ్యాతి పొందిందనే విషయాన్ని అధికారులు గుర్తించుకుంటే మంచిదని చురకలంటిచారు. క్రికెట్ పరిపాలన అధికారుల వల్ల ఆ క్రీడ బ్రతుకుందని తాను అనుకోవడం లేదన్నారు. అటువంటప్పుడు ఆ పదవుల్ని పట్టుకుని ఎందుకు వెళాడుతున్నారని ఆజాద్ ఘాటుగా విమర్శించాడు. తమ పదవులపై ఎందుకు అంత వ్యామోహమని ఆజాద్ మండిపడ్డారు. -
కేజ్రీవాల్, కీర్తి ఆజాద్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : డీడీసీఏ పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎంపీ కీర్తి ఆజాద్‌కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నోటీసులపై సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కాగా ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు తనపై చేసిన ఆరోపణలపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చట్టపరచర్యలకు దిగిన విషయం తెలిసిందే. మరోవైపు డీడీసీఏ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కేజ్రీవాల్‌తో పాటు, కీర్తి ఆజాద్‌కు నోటీసులు ఇచ్చింది. -
మా ఆరోపణలకు ఆధారాలున్నాయి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ, జిల్లా క్రికెట్ సంఘం(డీడీసీఏ)లో అక్రమాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై తాను చేసిన ఆరోపణలు వాస్తవాలని, వాటికి కచ్చితమైన ఆధారాలున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత రాఘవ్ చద్దాలు స్పష్టం చేశారు. తనపై, మరో ఐదుగురు ఆప్ నేతలపై జైట్లీ వేసిన పరువునష్టం దావాకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన నోటీసులకు మంగళవారం కేజ్రీవాల్ సమాధానమిచ్చారు. డీడీసీఏ అక్రమాలపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్‌ను ఈ దావాలో భాగస్వామిని చేయకపోవడాన్ని కేజ్రీవాల్ ప్రశ్నించారు. తమ వాదనకు మద్దతుగా డీడీసీఏ వార్షిక భేటీ వివరాలను, ఫోన్ రికార్డులను వారు కోర్టుకు సమర్పించారు. -
'దమ్ముంటే నన్ను పార్టీ నుంచి గెంటేయండి'
న్యూఢిల్లీ: బీజేపీ అసమ్మతి నేత, ఎంపీ శత్రుఘ్నసిన్హా పార్టీని ఇరకాటంలో పెట్టేలా తన విమర్శల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. బిహార్ ఎన్నికల్లో బీజేపీకి తలనొప్పిగా వ్యవహరించిన ఈ షాట్‌గన్ ఆ తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదు. దీంతో పార్టీ అసమ్మతి ఎంపీ కీర్తి ఆజాద్ తరహాలో శత్రుఘ్నపై కూడా బీజేపీ చర్యలు తీసుకునే అవకాశముందని వినిపిస్తోంది. ఈ వార్తలపై స్పందించిన శత్రుఘ్న దమ్ముంటే బీజేపీ తనను పార్టీ నుంచి బహిష్కరించాలని సవాల్ చేశారు. పార్టీ నుంచి తనను తొలగించినా తన పంథా మారదని ఆయన స్పష్టం చేశారు. 'నేను పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పని చేయలేదు. అయినా నన్ను వారు పార్టీని గెంటేయాలనుకుంటే గెంటేయ్యవచ్చు. కానీ చర్యకు తగిన ప్రతి చర్య కూడా ఉంటుందన్న న్యూటన్ మూడో సిద్ధాంతాన్ని వారు గుర్తించాలి' అని శత్రుఘ్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అరుణ్ జైట్లీ వ్యవహారంలో ఆరోపణలు చేసి బిహార్ బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ బీజేపీ నుంచి సస్పెండైన సంగతి తెలిసిందే. అయినా శత్రుఘ్న తన పంథాను మార్చలేదు. కీర్తి ఆజాద్‌ను హీరో అని పొగుడుతూ.. బీజేపీని ఇరకాటంలో పడేసే విధంగా ఆయన ట్విట్టర్లో బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. -
కీర్తి ఆజాద్ కు బీజేపీ షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ : పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ కీర్తి ఆజాద్‌కు భారతీయ జనతా పార్టీ శుక్రవారం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆయనను సూచించింది. షోకాజ్ నోటీసుపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కీర్తి ఆజాద్ ను ఆదేశించింది. కాగా డీడీసీఏ (ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అక్రమాల వ్యవహారంలో సొంత పార్టీకి చెందిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై కీర్తి ఆజాద్ బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా జైట్లీని ప్రాసిక్యూట్ చేయాలంటూ ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు నివేదిక సిఫారసు చేసిందని ఆయన నిన్న వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ కీర్తి ఆజాద్ కు నోటీసులు జారీ చేసింది. -
ఢిల్లీ సీఎంపై మరో కేసు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ క్రికెట్ సంఘాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. అరుణ్ జైట్లీ ఇప్పటికే కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేయగా, డీడీసీఏ కూడా అదేబాటలో నడవాలని నిర్ణయించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు బీజేపీ బహిష్కృత ఎంపీ కీర్తి ఆజాద్‌లపై పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్టు బుధవారం డీడీసీఏ ప్రకటించింది. అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డీడీసీఏలో దారుణ అక్రమాలు, అవినీతి జరిగాయని మంగళవారం కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. డీడీసీఏ అధికారులు లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను డీడీసీఏ ఖండించింది. కేజ్రీవాల్ ఎలాంటి ఆధారాలూ లేకుండా, గుడ్డిగా ఆరోపణలు చేశారని పేర్కొంది. డీడీసీఏ కుంభకోణంలో జైట్లీ పాత్ర ఉందని గతంలో కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ కేసు నుంచి జైట్లీని తప్పించడానికే తన కార్యాలయంలో సీబీఐ దాడులు చేయించారని విమర్శించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఖండించిన అరుణ్ జైట్లీ ఆయనపై పరువు నష్టం కేసు వేశారు. ఇక కీర్తి ఆజాద్.. డీడీసీఏతో పాటు జైట్లీపై విమర్శలు చేసి బీజేపీని సస్పెండ్ అయ్యారు. -
క్షమాపణ కోసం అడుక్కుంటోంది
♦ బీజేపీ డిమాండ్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ♦ ఎవరికీ క్లీన్చిట్ ఇవ్వలేదన్న ఢిల్లీ ప్రభుత్వం ♦ డీడీసీఏపై సీబీఐ, ఈడీ విచారణకు కీర్తి ఆజాద్ డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ క్లీన్చిట్ ఇవ్వలేదని, అందువల్ల తాను జైట్లీకి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. జైట్లీపై ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని, అందువల్లే ఆయనపై ఆరోపణలు చేసినందుకు కేజ్రీవాల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదివారం బీజేపీ డిమాండ్ చేసింది. దీనిపై కేజ్రీవాల్ ట్విట్టర్లో స్పందిస్తూ.. బీజేపీ క్షమాపణల కోసం తనను అడుక్కునే పరిస్థితికి వచ్చిందని ఎద్దేవా చేశారు. పరువు నష్టం కేసు దాఖలు చేసిన జైట్లీ క్రాస్ ఎగ్జామిన్‌ను ఎదుర్కోవాలని చెప్పారు. డీడీసీఏలో పలు అవకతవకలు జరిగినట్టు కమిషన్ నిర్ధారించిందని, అయితే దీనికి ఎవరినీ బాధ్యులుగా గుర్తించలేదని స్పష్టం చేశారు. ఎవరికీ క్లీన్చిట్ ఇవ్వలేదు: ఢిల్లీ ప్రభుత్వం తాము ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ జైట్లీకి క్లీన్చిట్ ఇచ్చిందంటూ బీజేపీ ప్రకటించడాన్ని ఢిల్లీ ప్రభుత్వం తప్పుపట్టింది. డీడీసీఏపై దర్యాప్తు ఇప్పుడే ప్రారంభమైందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అన్నారు. జైట్లీ హయాంలో అక్రమాలు జరగనట్లయితే విచారణకు ఎందుకు భయపడుతున్నారని బీజేపీని ప్రశ్నించారు. విచారణ కమిషన్ ఎవరి పేర్లను ప్రస్తావించలేదని, కానీ అవకతవకలు జరిగినట్టు గుర్తించిందని, అంటే దెయ్యాలు వచ్చి అవినీతికి పాల్పడ్డాయా? అని ఎద్దేవా చేశారు. జైట్లీని తప్పించేందుకు ఎందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. విచారణ ప్రక్రియ లైవ్ టెలికాస్ట్ చేయాలి: సుబ్రహ్మణియమ్ కాగా, డీడీసీఏ విచారణ ప్రక్రియను లైవ్‌టెలికాస్ట్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రహ్మణియమ్ కోరారు. దీనివల్ల విచారణ ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని అంటున్నారు. బహిరంగ విచారణ జరపుతామని తాము ముందే చెప్పామని, విచారణ ఎలా సాగుతుందనే విషయాన్ని ప్రపంచంలో ఎక్కడివారైనా సరే చూసేలా టెలికాస్ట్ చేయాలని భావిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఓ లేఖ రాశారు. మరోవైపు డీడీసీఏ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్లతో విచారణ జరిపించాలని బీజేపీ నుంచి సస్పెండెడ్ ఎంపీ కీర్తి ఆజాద్ డిమాండ్ చేశారు. తాను అరుణ్‌జైట్లీని మాత్రమే టార్గెట్ చేసుకోవడం లేదని, డీడీసీఏ డెరైక్టర్లుగా ఉన్న కాంగ్రెస్ నేతలు రాజీవ్‌శుక్లా, నవీన్ జిందాల్, అర్వీందర్‌సింగ్ లవ్లీ తదితరులు కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. -
మోదీ వద్దకు డీడీసీఏ పంచాయితీ!
న్యూఢిల్లీ : బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎంపీ కీర్తి ఆజాద్...ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరారు. ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఉందని కీర్తి ఆజాద్ ఆరోపణలు సంధించిన విషయం తెలిసిందే. సొంత పార్టీకి చెందిన కేంద్ర ఆర్థికమంత్రిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసి, ట్వీట్ల యుద్ధం ప్రకటించిన ఆయనపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో కీర్తి ఆజాద్...ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. '1996లో ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీని అహ్మదాబాద్‌లో కలిశా. అప్పట్లో ఆయన జనరల్ సెక్రటరీగా పనిచేసేవారు. ఆ సమయంలో మోదీతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నా అభ్యర్థనను ఆయన సానుకూలంగా విని న్యాయం చేస్తారని భావిస్తున్నా' అని కీర్తి అజాద్ నిన్న అహ్మదాబాద్‌లో పేర్కొన్నారు. మరోవైపు కీర్తి అజాద్ సస్పెన్షన్‌పై బీజేపీ సీనియర్ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. -
ప్రధాని జోక్యం చేసుకోవాలి!
-
నా సస్పెన్షన్ వ్యవహారంలో జోక్యం చేసుకోండి
-
నేను ఏ వ్యక్తినీ తప్పుబట్టలేదు
-
ఆజాద్‌ను కలవనున్న అద్వానీ!
న్యూఢిల్లీ: బీజేపీలో అరుణ్ జైట్లీ, కీర్తి ఆజాద్ మధ్య నెలకొన్న వివాదం విషయంలో బీజేపీ కురువృద్ధ నేతలు తలదూర్చనున్నారు. వారు కీర్తీ ఆజాద్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఆజాద్ కూడా బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషితో భేటీ అవనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసి, ట్వీట్ల యుద్ధం ప్రకటించడంతో పార్టీ నుంచి ఆజాద్ సస్పెన్షన్ వేటు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నిజాలు చెప్పడమే తాను చేసిన నేరమైతే.. ఎప్పటికీ నేరాలకు పాల్పడుతూనే ఉంటానని కూడా ఆజాద్ అన్నారు. దీంతో కీర్తి ఆజాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితంగా బీజేపీలో కలకలం రేగింది. పార్టీ సీనియర్ నేతలు తమ పార్టీ చేసిన పనిని ఎలా సమర్థించాలో అని తలలు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. గురువారం మురళీ మనోహర్ జోషి నివాసంలో భేటీ అయిన ఎల్ కే అద్వానీ, శాంతకుమార్, జోషి, యశ్వంత్ సిన్హా సస్పెండ్ ఈ అంశాన్ని చర్చించారు. తమ అసంతృప్తిని గతంలో మాదిరిగా బహిరంగంగా ప్రకటించకుండా పార్టీలోనే లేవనెత్తాలని నిర్ణయించారు. బీహార్ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ ఓటమిపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీని బహిరంగంగా విమర్శించిన విషయం తెలిసిందే. -
కీర్తి ఆజాద్ కీర్తి పెరిగింది...
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకుల నుంచి సగటుజీవి వరకు స్పందిస్తున్నారు. జైట్లీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకా, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు చర్య తీసుకున్నారా? అని పశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సరే, 1983లో భారత క్రికెట్లో రాణించిన నాటికన్నా ఇప్పుడే కీర్తి ఆజాద్ పాపులారిటీ పెరిగిందని సోషల్ మీడియా వ్యాఖ్యానించింది. కీర్తి ఆజాద్ అంశాన్ని చర్చించేందుకు సమావేశమైన ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషిలాంటి పార్టీ పెద్ద తలకాయలు పార్టీ నిర్ణయాన్ని ఎలా సమర్థించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట! -
కీర్తి ఆజాద్ సస్పెన్షన్‌పై బీజేపీ భేటీ
-
కీర్తి ఆజాద్ సస్పెన్షన్‌పై బీజేపీ అగ్రనేతల భేటీ
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు గురువారమిక్కడ సమావేశమయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన దర్భంగ ఎంపీ కీర్తి అజాద్ పై సస్పెన్షన్ వేటు నేపథ్యంలో పార్టీ అగ్రనేత ఎల్ కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, శాంతకుమార్, యశ్వంత్ సిన్హా తదితరులు భేటీ అయ్యారు. కీర్తి అజాద్ విషయంపై వారు మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు బహిష్కరణ వేటు పడిన కీర్తి ఆజాద్‌కు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి మద్దతు పలికారు. నిజాయతీ గల నాయకుడిని పార్టీ వదులుకోదంటూ ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఉందని కీర్తి ఆజాద్ ఆరోపణలు సంధించారు. ఈ నేపథ్యంలో ఆజాద్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా సస్పెన్షన్ పై కీర్తి ఆజాద్ స్పందిస్తూ తనకు నోటీసులు అందాయని, ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. -
'నిజాలు చెప్పడమే నేను చేసిన నేరమా?'
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసి, ట్వీట్ల యుద్ధం ప్రకటించి పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు పడిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మరోసారి ఘాటుగా స్పందించారు. నిజాలు చెప్పడమే తానే చేసిన నేరమైతే.. ఎప్పటికీ నేరాలకు పాల్పడుతూనే ఉంటానని వ్యాఖ్యానించారు. కీర్తి ఆజాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనకు నోటీసులు అందాయని ఆజాద్ తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే స్పందిస్తానన్నారు. నా సస్పెన్షన్‌కు గల కారణాలేంటో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానమివ్వాలని ఈ సందర్బంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామి సహాయాన్ని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో బీసీసీఐకి సంబంధించిన అవినీతిపై తాను ప్రశ్నలు లేవనెత్తానని గుర్తచేశారు. పార్టీపై తాను ఎప్పుడు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని, కేవలం అవినీతిపై మాత్రమే తాను నోరు విప్పినట్లు చెప్పారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) లో జరిగిన అక్రమాల గురించి గత తొమ్మిదేళ్లుగా తాను చెబుతన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్నారు. డీడీసీఏ అక్రమాల వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. సొంత పార్టీకి చెందిన అగ్రనేత అయిన జైట్లీకి ఆయన బహిరంగ సవాల్ విసిరారు. జైట్లీ తనపై కూడా పరువునష్టం దావా వేయాలని, 13 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా వ్యవహరించిన జైట్లీ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కీర్తి ఆజాద్ సానుకూలంగా స్పందిస్తూ వస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనపై పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు పడింది. -
'అతడే... హీరో ఆఫ్ ది డే'
న్యూఢిల్లీ: పార్టీ నుంచి సస్పెండైన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ కు బాలీవుడ్ సీనియర్ నటుడు, పాట్నా ఎంపీ శత్రుఘ్నసిన్హా బాసటగా నిలిచారు. ఆజాద్ ను 'హీరో ఆఫ్ ది డే'గా వర్ణించారు. అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన ఆజాద్ వేటు వేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. సీనియర్ నేత అద్వానీని ఆదర్శంగా తీసుకోవాలని అరుణ్ జైట్లీకి సూచించారు. డీడీసీఏ కేసును రాజకీయంగా ఎదుర్కొవాలని సలహాయిచ్చారు. 'కీర్తి ఆజాద్- ఈ రోజు హీరోగా నిలిచాడు. అవినీతి గురించి వెల్లడించిన ఆజాద్ పై అనాలోచిత చర్యలు మానుకోవాలని పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నా. న్యూటన్ మూడో సూత్రం మర్చిపోరాదు. చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. తనపై వచ్చిన ఆరోపణలను ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ రాజకీయంగా ఎదుర్కొవాలి గానీ చట్టపరంగా కాదు. ఎల్ కే అద్వానీ లా నిష్కళంకంగా బయటపడాలని అరుణ్ జైట్లీకి సూచించాలని డాషింగ్ డైనమిక్ ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నా' అని శత్రుఘ్నసిన్హా ట్వీట్ చేశారు. -
అవినీతికి వ్యతిరేకంగా అసహనం ఏదీ?
న్యూఢిల్లీ: ఎంపీ కీర్తి ఆజాద్ ను బీజేపీ సస్పెండ్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పిన ఆజాద్ పై కమలం వేటు వేయడాన్ని పలు రాజకీయ పార్టీలు తప్పుబట్టాయి. బీజేపీలో ప్రజాస్వామ్యం లేదని, అవినీతిపరులను కాపాడేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. యాంటి కరెప్షన్ కాస్తా యాంటి బీజేపీగా మారిందని... ఇప్పుడు ప్రధాని మోదీ కొత్త నినాదం ఇదేనని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జివాలా ట్విటర్ లో పేర్కొన్నారు. వ్యాపం, లలిత్ మోదీ, పీడీఎస్ కుంభకోణాల్లో నిందితులను ప్రధాని నరేంద్ర మోదీ కాపాడారని, డీడీసీఏ స్కామ్ లో ఇరుక్కున్న వారిని కూడా ఇప్పుడు రక్షిస్తున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా అసహనం ఎక్కడా అని ట్విటర్ లో ప్రశ్నించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకా లేదా అవినీతిని బయటపెట్టినందుకు ఆజాద్ పై చర్య తీసుకున్నారా అని యూత్ కాంగ్రెస్ ట్విటర్ లో ప్రశ్నించింది. అవినీతిని బయటపెడితే ఎవరికైనా ఇలాంటి గతే పడుతుందని ఈ చర్యతో బీజేపీ హెచ్చరించిందని పేర్కొంది. ఎవరైనా అవినీతి గురించి వెల్లడిస్తే ఎలాంటి చర్య తీసుకోవాలో ఆజాద్ పై వేటు ద్వారా తమ పార్టీ ముఖ్యమంత్రులకు బీజేపీ సందేశమిచ్చిందని ఎద్దేవా చేసింది. ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఉందని ఆరోపణలు చేసిన కీర్తి ఆజాద్ ను బీజేపీ బుధవారం సస్పెండ్ చేసింది. Where is zero tolerance against corruption? PM Modi protecting the accused - first Vyapam-Lalit Modi-PDS scam. Now DDCA scam #KirtiAzad — Gaurav Gogoi (@GauravGogoiAsm) December 23, 2015 There is no democracy in BJP. Honest voices are muzzled to protect corruption — Arvind Kejriwal (@ArvindKejriwal) December 23, 2015 -
నన్ను సస్పెండ్ చేయడం పార్టీకే దురదృష్టం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై ఆరోపణలు చేసినందుకు బీజేపీ తనను సస్పెండ్ చేయడంపై ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ స్పందించారు. తానేం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశానని తనను సస్పెండ్ చేశారని బీజేపీ అధినాయకత్వాన్ని ఆయన ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేయడం పార్టీకే దురదృష్టం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తాను తొమ్మిదేళ్లుగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నానని, గతంలోనే పార్టీ పెద్దలు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో పార్టీదే బాధ్యత అని, తనదేం తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. తొమ్మిదేళ్లుగా తాను ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నాని, తాను ఎవరి గురించి వ్యక్తిగతంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెప్పారు. నిజాలు మాట్లాడేవారిని బీజేపీ నుంచి గెంటేస్తున్నారని, మున్ముందు ఇంకా ఏం జరుగనుందో వేచి చూడాలని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ క్రికెట్ బోర్డు అవినీతి వ్యవహారంలో అరుణ్‌జైట్లీపై కీర్తి ఆజాద్ బాహాటంగా ఆరోపణలు చేశారు. దీనిపై కన్నెర్ర జేసిన బీజేపీ ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఎంపీ కీర్తి ఆజాద్ పై సస్పెన్షన్ వేటు
-
ఎంపీ కీర్తి ఆజాద్ పై సస్పెన్షన్ వేటు
సొంత పార్టీకి చెందిన కేంద్ర ఆర్థికమంత్రిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసి, ట్వీట్ల యుద్ధం ప్రకటించిన తమ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మీద బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఉత్తర్వులు జారీ చేశారు. డీడీసీఏ (ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అక్రమాల వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై బీజేపీ ఎంపీ మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ విరుచుకుపడ్డారు. జైట్లీ తనపై కూడా పరువునష్టం దావా వేయాలన్నారు. 'హల్లో డియర్ అరుణ్‌జైట్లీ.. నాపై కూడా పరువునష్టం దావా వేస్తున్నావు కదా? ప్లీజ్ నా మీద కూడా వెయ్యి.. మినహాయింపు ఏమీ వద్దు. భావప్రకటనా స్వేచ్ఛను హరించకు' అని ట్వీట్ చేశారు. 'నా పేరు ఎందుకు కేసులో చేర్చలేదు. మీరే కదా నేను రిజిస్టర్ పోస్టులో పంపించిన లేఖలు చూపించింది. నాపై కూడా కేసు పెట్టండి' అని పేర్కొన్నారు. -
ఆ హీరో మరో 'హీరో'ను పొగిడారు!
పట్నా: అలనాటి బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా సహచర పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను 'హీరో' అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని కితాబిచ్చారు. ఢిల్లీ క్రికెట్ బోర్డు అక్రమాల విషయంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై కీర్తి ఆజాద్ బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అసమ్మతి ఎంపీగా ముద్రపడిన షాట్‌గన్ శత్రుఘ్న ఆయనకు బాసటగా నిలువడం గమనార్హం. 'ఈ రోజుకు నిజమైన హీరో కీర్తి ఆజాదే. మిత్రులారా నాదొక విన్నపం. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేవారిపై వెంటనే విరుచుకుపడకండి. వారిపై నిర్బంధ చర్యలకు పాల్పడకండి' అని శత్రుఘ్న బుధవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎంపీ కీర్తి ఆజాద్‌పై బీజేపీ అధినాయకత్వం చర్యలు తీసుకోకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు విభిన్నమైన పార్టీగా పేరొందిన బీజేపీ ఇప్పుడు విభేదాలు పార్టీగా మారిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా డీడీసీఎ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి కూడా ఆయన ఓ సలహా ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని, గతంలో అద్వానీజీ అనుసరించిన మార్గాన్ని జైట్లీ కూడా పాటించాలని సూచించారు. హవాలా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో 1990లో అద్వానీ ఎన్నికల్లో పోటీచేయని విషయాన్ని పరోక్షంగా గుర్తుచేశారు. KirtiAzad-hero of the day.Humble appeal to friends.Avoid knee jerk reaction/coercive action against friend who's fighting against corruption — Shatrughan Sinha (@ShatruganSinha) December 23, 2015 -
ఆజాద్ పై క్రమశిక్షణ చర్య!
న్యూఢిల్లీ: అరుణ్ జైట్లీని టార్గెట్ చేసిన మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ పై పార్టీ అధినాయకత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం వ్యవహారంలో సొంత పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై బహిరంగ ఆరోపణలు చేసి బీజేపీని ఇరుకున పడేశారు ఆజాద్. అంతేకాదు తనపై కేసు పెట్టాలని జైట్లీని సవాల్ చేశారు. అధిష్టానం జైట్లీకి మద్దతు ప్రకటించినా ఆయన వెనక్కు తగ్గలేదు. 13 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన జైట్లీ హయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా బీజేపీ అగ్రనేతలు జైట్లీని వెనకేసుకొచ్చినా ఆజాద్ మాత్రం తన వాదనకు కట్టుబడ్డారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుజ్జగించినా లెక్కచేయలేదు. పార్టీకి తలనొప్పిగా మారిన ఆజాద్ పై ఈ రోజు సాయంత్రంలోగా ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
స్వపక్షంలో విపక్షంలా కీర్తీ ఆజాద్
-
'కీర్తి ఆజాద్ పై చర్యలు తీసుకోండి'
పట్నా:డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అక్రమాల వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విమర్శించిన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ పై చర్యలు తీసుకోవాలని పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ డిమాండ్ చేశారు. పార్టీ నియమావళిని తుంగలో తొక్కాలని ప్రయత్నిచిస్తే చర్యలు తప్పవని సుశీల్ కుమార్ హెచ్చరించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఆజాద్ పై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు సుశీల్ వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజుల నుంచి జైట్లీని ఆజాద్ విమర్శిస్తున్నా.. ఇప్పటివరకూ బీజేపీ నేతలెవరూ నోరు మెదపలేదు. కాగా, తొలిసారి ఆజాద్ పై క్రమ శిక్షణా చర్యలు చేపట్టాలని సుశీల్ కుమార్ మోదీ డిమాండ్ చేయడం గమనార్హం. కొన్ని రోజుల నుంచి డీడీసీఏ వ్యవహారంపై జైట్లీని టార్గెట్ చేస్తూ కీర్తి ఆజాద్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నసంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేసిన అనంతరం జైట్లీపై ఆజాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే తనపై దావా వేయాలని జైట్లీకి ఛాలెంజ్ చేశారు. హాల్లో డియర్ అరుణ్‌జైట్లీ.. నాపై కూడా పరువునష్టం దావా వేస్తున్నావు కదా? ప్లీజ్ నా మీద కూడా వేయ్. మినహాయింపు ఏమీ వద్దు. భావప్రకటనా స్వేచ్ఛను హరించకు' అని ట్వీట్ చేశారు. 'నా పేరు ఎందుకు కేసులో చేర్చలేదు. మీరే కదా నేను రిజిస్టర్ పోస్టులో పంపించిన లేఖలు చూపించింది'అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆజాద్ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించే అవకాశాలు కనబడుతున్నాయి. -
'డియర్ జైట్లీ.. దమ్ముంటే నాపై దావా వేయ్'
న్యూఢిల్లీ: డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అక్రమాల వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై బీజేపీ ఎంపీ మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మరోసారి విరుచుకుపడ్డారు. సొంత పార్టీకి చెందిన అగ్రనేత అయిన జైట్లీకి ఆయన బహిరంగ సవాల్ విసిరారు. జైట్లీ తనపై కూడా పరువునష్టం దావా వేయాలని పేర్కొన్నారు. 13 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా వ్యవహరించిన జైట్లీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ ప్రభుత్వం మీద అరుణ్‌జైట్లీ పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే జైట్లీపై పరోక్ష విమర్శలు చేసిన కీర్తి ఆజాద్.. తాజాగా ఆయనపై బహిరంగంగా ట్వీట్ల యుద్ధానికి తెరలేపారు. 'హాల్లో డియర్ అరుణ్‌జైట్లీ.. నాపై కూడా పరువునష్టం దావా వేస్తున్నావు కదా? ప్లీజ్ నా మీద కూడా వేయ్. మినహాయింపు ఏమీ వద్దు. భావప్రకటనా స్వేచ్ఛను హరించకు' అని ట్వీట్ చేశారు. 'నా పేరు ఎందుకు కేసులో చేర్చలేదు. మీరే కదా నేను రిజిస్టర్ పోస్టులో పంపించిన లేఖలు చూపించింది. నాపై కూడా కేసు పెట్టండి' అని పేర్కొన్నారు. జైట్లీపై తన ట్లీట్ల గురించి ప్రస్తావించగా.. 'కృష్ణుడు బాలుడిగా ఉన్నప్పుడే కాళియ సర్పంతో పోరాడాడు. ఇప్పుడు ఈ వ్యవహారంలో కృష్ణుడు ఎవరో, కాళియుడు ఎవరో మీరు వ్యాఖ్యానించాలి' అని కీర్తి ఆజాద్ పేర్కొన్నారు. -
'అక్రమాలు నిజమే... జైట్లీకి సంబంధం లేదు'
న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)పై వచ్చిన నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మాజీ క్రికెటర్, బీజేపీ కీర్తి ఆజాద్ స్పందించారు. ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... డీడీసీఏ పలు మోసపూరిత కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చిందని, ఎటువంటి సంప్రదింపులు లేకుండానే డబ్బులు చెల్లించిందని ఆరోపించారు. డీడీసీఏ సభ్యులు టెండర్లలో అక్రమాలు చేశారని చెప్పారు. ల్యాప్ టాప్, ప్రింటర్లు తదితర వస్తుసామాగ్రిని అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేశారని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని అన్నారు. డీడీసీఏ ఆర్థిక అవకతవకలపై వికీలీక్స్ తయారుచేసిన వీడియోను ఆయనీ సందర్భంగా ప్రదర్శించారు. తాను ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద అభిమానినని... అవినీతిపైనే తాము పోరాటం చేస్తున్నామని, వ్యక్తులపై కాదని కీర్తి ఆజాద్ స్పష్టం చేశారు. అక్రమాలకు సంబంధించిన వీడియో బయటపెట్టడంతో నిధుల దుర్వినియోగం జరిగినట్టు డీడీసీఏ ఒప్పుకుంది. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. -
క్రికెటర్లకు దేశభక్తి లేదు!
దర్భాంగా(బీహార్): ఇంగ్లండ్ లో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు భారత మాజీ క్రికెటర్లు టీమిండియా ఆటతీరుపై మండిపడుతుంటే తాజాగా ఆ జాబితాలో కీర్తి ఆజాద్ చేరిపోయారు. టీమిండియా ఆటగాళ్లలో నిబద్ధత లోపించడమే కాకుండా, వారిలో అసలు దేశభక్తి అనేది లేకుండా పోయిందని ఆజాద్ విమర్శలకు దిగాడు. భారత్ లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లకు మాత్రమే ఆటగాళ్లు అధిక ప్రాధాన్యత ఇచ్చి, దేశం తరుపున ఆడటానికి వచ్చేసరికి మిన్నుకుండు పోతున్నారని ఎద్దేవా చేశారు. ఇంగ్లండ్ లో 3-1 తేడాతో టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన అనంతరం బీసీసీఐ చేపట్టిన ప్రక్షాళనతో భారీ మార్పులు వస్తాయని తాను అనుకోవడం లేదన్నారు. మరో మూడు రోజుల్లో ఆరంభం కానున్న వన్డే సిరీస్ కు మాజీ క్రికెటర్ రవిశాస్త్రిని టీమిండియా డైరెక్టర్ గా నియమించడంతో జట్టులో ఆకస్మిక మార్పులు ఏమీ రావన్నాడు. టీమిండియాకు తాత్కాలిక డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి నియామకంతో శాశ్వత పరిష్కారం లభించినట్లు కాదన్నాడు. అతను ఈ వన్డే సిరీస్ కు జట్టులోని చిన్నపాటి లోపాల్ని మాత్రమే సరిచేయగలడని ఆజాద్ తెలిపారు. ఒక గోడపై వచ్చిన పగుళ్లను కనబడకుండా ఉండేందుకు చేసే పనుల మాదిరిగా అతని నియామకం ఉందన్నాడు. టీమిండియా ఆటగాళ్లు పూర్తి నిబద్ధతతో ఆడినప్పుడే మాత్రమే జట్టు విజయాల బాట పడుతుందని స్పష్టం చేశాడు.1983 వరల్డ్ కప్ గెలిచిన భారత టీంలో సభ్యుడైన కీర్తి ఆజాద్.. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. -
'అండర్సన్ కాదు.. బ్యాండర్ సన్'
న్యూఢిల్లీ: పటౌడీ సిరీస్ భాగంగా ఇంగ్లాండ్ జరుగుతున్న భారత పర్యటన హాట్ టాపిక్ గా మారింది. భారత ఆటగాడు రవీంద్ర జడేజా, ఇంగ్లాడ్ బౌలర్ అండర్సన్ ల మధ్య చోటు చేసుకున్న వివాదంపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తీ ఆజాద్ తీవ్రంగా స్పందించారు. జడేజాపై దురుసుగా ప్రవర్తించిన అండర్సన్ పై నిషేధం విధించాలని ఆజాద్ డిమాండ్ చేశారు. అండర్సన్ పై నిషేధం విధించి బ్యాండర్ సన్ ('Ban'derson) గా మార్చాలని ఆజాద్ వ్యాఖ్యానించారు. నాటింగ్ హామ్ టెస్టు రెండో రోజు లంచ్‌కు ముందు ఆఖరి బంతికి అండర్సన్... జడేజా అవుట్ అంటూ అప్పీలు చేశాడు. దీనిని అంపైర్ తోసిపుచ్చారు. ఆ వెంటనే రెండు జట్ల ఆటగాళ్లు లంచ్‌కు వెళ్లే సమయంలో ‘నీ ప్యాంట్ నుంచి వాసన వస్తోంది.., నీ చెవికి ఆ పోగులెందుకు’... అంటూ అండర్సన్ దూషణకు దిగడంతో పాటు జడేజాను తోసేయడం వివాదంగా మారింది. -
ముగ్గురే గెలిచారు
ఐదుగురు మాజీ క్రీడాకారులకు నిరాశ అజహర్, కైఫ్లకూ తప్పని ఓటమి న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో క్రీడా ప్రముఖులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఏథెన్స్ ఒలింపిక్ మెడలిస్ట్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, మాజీ క్రికెటర్ కీర్తి అజాద్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించగా... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసిన రాథోడ్ జైపూర్(రూరల్) నుంచి 3.32 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ కురువృద్ఢుడు సీపీ జోషిపై విజయ దుందుభి మోగించారు. అర్మీలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన రాథోడ్ గత సెప్టెంబర్‌లో బీజేపీలో చేరి తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించారు. నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వంలో రాజ్యవర్ధన్‌కు క్రీడల మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ‘జైపూర్(రూరల్) నియోజకవర్గానికి సేవలందించడమే నా తొలి ప్రాధాన్యం. మా కెప్టెన్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఏ బాధ్యతనైనా స్వీకరించేందుకు నేను సిద్ధం’ అని రాథోడ్ ప్రకటించారు. ఇక మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫూల్పూర్ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యాడు.