ఎంపీ కీర్తి ఆజాద్ పై సస్పెన్షన్ వేటు
సొంత పార్టీకి చెందిన కేంద్ర ఆర్థికమంత్రిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసి, ట్వీట్ల యుద్ధం ప్రకటించిన తమ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మీద బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఉత్తర్వులు జారీ చేశారు. డీడీసీఏ (ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అక్రమాల వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై బీజేపీ ఎంపీ మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ విరుచుకుపడ్డారు. జైట్లీ తనపై కూడా పరువునష్టం దావా వేయాలన్నారు.
'హల్లో డియర్ అరుణ్‌జైట్లీ.. నాపై కూడా పరువునష్టం దావా వేస్తున్నావు కదా? ప్లీజ్ నా మీద కూడా వెయ్యి.. మినహాయింపు ఏమీ వద్దు. భావప్రకటనా స్వేచ్ఛను హరించకు' అని ట్వీట్ చేశారు. 'నా పేరు ఎందుకు కేసులో చేర్చలేదు. మీరే కదా నేను రిజిస్టర్ పోస్టులో పంపించిన లేఖలు చూపించింది. నాపై కూడా కేసు పెట్టండి' అని పేర్కొన్నారు.