న్యూఢిల్లీ : డీడీసీఏ పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎంపీ కీర్తి ఆజాద్కు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నోటీసులపై సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కాగా ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు తనపై చేసిన ఆరోపణలపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చట్టపరచర్యలకు దిగిన విషయం తెలిసిందే. మరోవైపు డీడీసీఏ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కేజ్రీవాల్తో పాటు, కీర్తి ఆజాద్కు నోటీసులు ఇచ్చింది.