
పట్నా: సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. మాజీ క్రికెటర్, బిహార్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కీర్తి ఆజాద్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. దర్బంగా లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికవుతూ వస్తున్న ఆజాద్ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. కాగా బీజేపీ నాయకత్వంలో విభేదించి ఆయన ఇటీవల ఆపార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై అవినీతి ఆరోపణలు చేసినందుకు బీజేపీ నుంచి వేటుకు గురైయారు.
ఆజాద్‌ను దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పోటీలో నిలుపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సామాజిక వర్గానికి చెందిన పూర్వాంచాలీస్ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆజాద్‌ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ వ్యూహత్మకంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతంలో ఆయన ఢిల్లీలో గోలే మార్కెట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా భారత్ గెలిచిన 1983 వన్డే ప్రపంచకప్‌లో కీర్తి ఆజాద్ కూడా సభ్యుడన్న విషయం విధితమే.
Comments
Please login to add a commentAdd a comment